Advertisement
ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. అయితే, పెళ్లికి సంబంధించిన లగ్న పత్రికలను పంచడం అనేది కీలకం. బంధువుల ఇంటికి వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చి వివాహానికి రమ్మని ఆహ్వానించడం ఆనవాయితీ. కానీ ఒకే ముహూర్తానికి ఓ వ్యక్తి ఇద్దరినీ ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, ఇక ఓ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ కార్డులో వరుడు ఒక్కడే కానీ వధువులు ఇద్దరూ అని చేర్చారు.
Advertisement
Also Read: నాటు నాటు పాట కోసం ఎన్ని నెలలు కష్టపడ్డారో తెలుసా..? ఈ పాట ఎలా పుట్టిందంటే..?
ఇక ఈ పెళ్లి కూడా పెద్దల సమక్షంలో జరగడం మరింత విశేషం. ఒకే ముహూర్తానికి ఒకే వ్యక్తి ఇద్దరు ప్రియురాళ్లను పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి ఈ రోజు ఉదయం జరిగింది. ఇక ఈ పెళ్లి గురించి తెలిసిన వారు భలే పెళ్లి అనుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి స్వప్న, సునీత అనే అమ్మాయిలను ప్రేమించాడు. ఈ క్రమంలో సత్తిబాబుకు స్వప్నతో పెళ్లి చేయాలని ఇరువురు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సునీత ప్రియుడు సత్తిబాబును నిలదీసింది.
Advertisement
Read also: సంక్రాంతి బరిలో విడుదలై డిజాస్టర్లు గా మిగిలిన సినిమాలు ఏవంటే ?
ఈ విషయం మీరు కుటుంబ సభ్యులకు తెలియగా ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని సత్తిబాబు చెప్పుకొచ్చాడు. దీనికి సత్తిబాబు, స్వప్న, సునీత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట. ఈ మేరకు పెళ్లి కార్డులో ఇద్దరినీ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రింట్ చేయించారు. అది కూడా ఒకే ముహూర్తానికి కావడం విశేషం. ఇక ఈ పెళ్లి వెనుక ఓ కారణం ఉన్నట్టు తెలుస్తుంది. సత్తిబాబు గిరిజన తెగకు చెందినవాడు. వీరి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు కొన్ని రోజులు కాపురం చేయాల్సింది. దీని ఫలితంగా వారిద్దరికీ ఒక్కో సంతానం కూడా జన్మించారు. ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సత్తిబాబు నేడు గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. ఈ కారణం తెలిసిన పలువురు ఆశ్చర్యపోతున్నారు.
Read also: గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్ భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?