Advertisement
రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీపార్వతి అంటే తెలియని వారు ఉండరు.. ఈమె ఎప్పుడు ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ రెండో భార్యగా వచ్చిన తర్వాత అందరికీ పరిచయమైంది. కానీ ఈమెను నందమూరి ఫ్యామిలీ వారిలో కలుపుకోవడానికి సుముకత చూపలేదు. కానీ ఈమె ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత పార్టీ పగ్గాలని తీసుకోవాలని భావించింది. కానీ నందమూరి ఫ్యామిలీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె బయటకు వచ్చి సొంతంగా పోరాడుతోంది.
Advertisement
Also Read: కేటీఆర్ పై కిషన్ రెడ్డి.. మోడీపై కేటీఆర్.. పంచ్ ల ప్రవాహం..!
కొన్నాళ్లు పెద్దగా కనిపించని లక్ష్మీపార్వతి వైసీపీ పార్టీలో చేరిన తర్వాత జగన్ తరఫున టిడిపిని విమర్శిస్తూ మీడియాతో ఎప్పుడూ పలు విశేషాలను పంచుకుంటుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వారాహిపై పలు కామెంట్స్ చేసింది. ఆయన బస్సు యాత్ర కోసం కొన్న వెహికల్ పేరు వారాహి. ఆ వాహనం గురించి లక్ష్మీపార్వతి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ వచ్చింది. వారహి వాహనం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కొండగట్టు వంటి గుడులకు వెళ్లి పూజలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేయలేదంటూ అడిగింది.
Advertisement
Also Read: కవిత ప్రోగ్రాంపై సస్పెన్స్..!
లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టేసరికి పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర మానుకున్నాడని, ఆయన వారాహి వాహనం షూటింగ్స్ లో హీరోయిన్స్ మేకప్ వేసుకోవడానికి, చిత్ర యూనిట్ ను ఒక చోటు నుంచి మరో చోటుకు తిప్పడానికి వాడుతున్నారని తెలియజేసింది. ఈ విషయాన్ని నేను సొంతంగా చెప్పడం కాదు షూటింగ్స్ వాళ్ళు చెబితే తెలిసిందంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుత ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read:మంగళ, శుక్రవారాల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకంటే..?