Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ లలో పృథ్వీరాజ్ కూడా ఒకరు. ఆయన కామెడీ అంటేనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది… పృథ్వీరాజు మాట వింటే ప్రతి ఒక్కరికి నవ్వు రాక మానదు. మాటలతోనే అద్భుత కామెడీని సృష్టించగల నటుడు పృథ్వీరాజ్. ఆయన 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగ్ ఇండస్ట్రీ లోనే ఫేమస్ అయిపోయింది.. దీంతో అయిన స్టార్ కమెడియన్ గా మారిపోయాడని చెప్పవచ్చు.. దీని తర్వాత అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. చాలా మంది స్టార్ హీరోలను ఇమిటేట్ చేస్తూ కామెడీ పండించడంలో పృథ్వీరాజ్ కు ఎవరు సాటి లేరు.. అలా ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన పర్సనల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Advertisement
ఈ విధంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం పృథ్వి తన భార్య నుంచి వేరుపడి కొద్ది రోజుల నుంచి విడిగానే ఉంటున్నారు. నా భర్త వేరే స్త్రీ తో సంబంధం ఉందని ప్రియురాలిపై తన భార్య కేసు పెట్టడంతో ఆ కేసు కోర్టులో నడుస్తోంది. అయితే పృథ్వీరాజ్ జీవితంలో మరొక స్త్రీ ఉన్నది అనేది మీడియాకు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉన్నది. ఈ మధ్య కాలంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న పృధ్విరాజ్ పలు సంచలన విషయాలు బయట పెట్టారు. తన జీవితం లో ఉన్నటువంటి మరో మహిళ దాసరి పద్మ రేఖా అని చెప్పారు . 2020లో తన జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన వెంట ఉన్న స్త్రీ ఆమె అని చెప్పారు. ప్రస్తుత సమాజంలో ఆడ,మగ కలిస్తే వేరే రకమైన రిలేషన్ అంటగడుతున్నారు.
Advertisement
నా జీవితంలో 20 సంవత్సరాల నుంచి నా బాగోగులు చూసుకుంటూ వస్తోంది ఆమె.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కన ఉంది.. కరోణ వచ్చినప్పుడు కూడా దగ్గరుండి చూసుకుంది.. వారి బంధువుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా వారి పిల్లలతో సమానంగా నన్ను చూస్తుంది. అయితే 2003లో వచ్చిన విమర్శలు సమయంలో దీని గురించి చెబుదామనుకున్నానని పృథ్వీరాజ్ అనగానే, ప్రస్తుతం సందర్భం వచ్చింది చెప్పండి అంటూ రాధాకృష్ణ ఆడగడంతో ఆమె పేరు దాసరి పద్మ రేఖ వరంగల్ నుంచి చెన్నైకి వచ్చారు. నేను చెన్నైలో ఉన్నప్పటీ నుంచి నాకు బాగా తెలుసు. ఆమెకి మంచి హెల్పింగ్ నేచర్.. వాళ్ళ తాతగారు కూడా నాకు చాలా బాగా తెలుసు.. నేను షూటింగ్లో ఉన్నప్పుడు నాకు భోజనం కూడా పంపిస్తూ ఉండేదని ఓపెన్ అయ్యారు.
also read;
పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం శిక్షలు ఇవే !!