Advertisement
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని ఈమధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద రచ్చే జరిగింది. అసలు.. టీడీపీ ఎవరిది..? ఆ మాట అంటానికి నువ్వు ఎవరవు? అనే డైలాగుల దాకా వెళ్లారు కొందరు. అయినా.. వాళ్ల తాత పెట్టిన పార్టీలోకి ఎన్టీఆర్ ని నువ్వు ఆహ్వానించడం ఏంటని విమర్శలు చేశారు. దీనికి టీడీపీ నేతలు కూడా ధీటుగా బదులిచ్చారు. అయితే.. ఈ వివాదం సద్దుమణిగిందని అనుకునేలోపు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తూ.. చంద్రబాబును కార్నర్ చేశారు నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
Advertisement
తాజాగా మీడియాతో మాట్లాడిన పోసాని.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ఉన్నప్పుడు తన భార్య అనారోగ్యంతో మరణించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయనకు అండగా ఉండడం కోసం లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారని తెలిపారు. అలాంటి ఒక మహిళను పట్టుకొని చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు పోసాని.
Advertisement
లక్ష్మి పార్వతిని తిట్టే వాళ్ళకి హరికృష్ణ రెండో భార్య, ఎన్టీఆర్ తల్లిని తిట్టే ధైర్యం ఉందా? అని అడిగారు. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడని అన్నారు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారని.. ఆయనతో చంద్రబాబుకు చాలా అవసరం ఉందని చెప్పారు.
చాలా వాంటెడ్ పర్సన్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ ఉన్నది ఎన్టీఆర్ కు మాత్రమేనని అన్నారు పోసాని. అందుకే ఆయన్ను ఎవరూ ఏమీ అనడం లేదని వ్యాఖ్యానించారు. అతనితో మంచిగా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయని ఆలోచిస్తున్నారని అన్నారు. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.