Advertisement
Kabza Movie Review in Telugu: శాండల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ “కబ్జా”. ఆర్ చంద్రు వ్రాసి దక్షకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించారు. తెలుగులో నిర్మాత ఎన్ సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రం విడుదలైంది.
Advertisement
Kabza Review, Story, Dialogues
పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్ లో ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. అయితే ఇంతకుముందే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నడ నుంచి మరో కేజీఎఫ్ రాబోతుందంటూ పలువురు కామెంట్స్ కూడా చేశారు. స్వతంత్రానికి ముందు సాగే కథ కబ్జా. అనుకోని పరిస్థితులలో అండర్ వరల్డ్ తో యుద్ధానికి దిగే అరకేశ్వర అనే ఎయిర్పోర్ట్స్ సైనికుడి కధే ఈ చిత్రం. 136 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Kabja Movie Dialogues in Telugu: కబ్జా డైలాగ్స్
Advertisement
Upendra Kabza Story in Telugu: కథ మరియు వివరణ:
1947 నుంచి 1984 కాలంలో నడిచే ఈ కథలో ఓ స్వతంత్ర సమరయోధుడి కొడుకు.. బ్రిటిష్ పాలనలో వైమానిక దళాధిపతి అయిన ఉపేంద్ర.. అనివార్య పరిస్థితుల కారణంగా మాఫియా వరల్డ్ లో ఎలా చిక్కుకున్నాడు, ఆ తర్వాత ఏ రేంజ్ కు చేరుకున్నాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ గా ఉంది. కబ్జా శాండిల్ వుడ్ ఇండస్ట్రీని మరోసారి గర్వపడేలా చేస్తుంది. నిజానికి ఈ స్టోరీ విన్నా, ట్రైలర్ చూసిన కేజిఎఫ్ గుర్తుకు రావడం ఖాయం. ఆ మూవీ రెండు భాగాలుగా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. వాటి ప్రభావం ఈ మూవీ పై పడినట్లు మేకింగ్ చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక కేజిఎఫ్ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీసిన రవి బస్రూర్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించారు. ఈ సినిమా మొత్తం ఉపేంద్ర షో, కిచ్చా సుదీప్ 10 నిమిషాల కేమియే నిరాశ పరుస్తుంది. ఇక సిరియా శరన్ నటన ఆకట్టుకుంది. ఇక కబ్జాలో శివన్న సర్ప్రైజ్ ఎంట్రీ ఘూస్ బంప్స్ తెప్పిస్తుంది. కన్నడలో 2023 సంవత్సరంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ గా ఈ చిత్రం కచ్చితంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. డల్ కలర్ టోన్, మ్యూజిక్ పరవాలేదు. ఇక విఎఫ్ఎక్స్ అస్సలు బాలేదని చెప్పాలి. స్టోరీ నేరేషన్ ఏమాత్రం గ్రిప్పింగ్ గా లేదు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పాత్రని చాలా బాగా తెరకెక్కించారు. సాధారణ గ్యాంగ్ స్టార్ మూవీ. కేజిఎఫ్ స్థాయిలో మాత్రం లేదు కానీ.. సేమ్ కేజిఎఫ్ లాంటి అనుభూతిని కలిగిస్తుంది.
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
కేజిఎఫ్ ను పోలి ఉండడం
ప్లస్ పాయింట్స్:
ఉపేంద్ర షో
మ్యూజిక్
దర్శకత్వం
రేటింగ్ 2.75/5
Read also: JABARDASTH COMEDIAN NARESH AGE: జబర్దస్త్ నరేష్ అసలు వయస్సు ఎంతో తెలుసా?