Advertisement
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఈ చిత్రం నుంచి “నాటు నాటు” సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచి మొట్టమొదటి భారతీయ సాంగ్ గా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సాంగ్ ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో ప్రతి ఒక్కరు ఈ విషయంపై స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం దక్కడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళినే.
Advertisement
Read also: RANGASTHALAM MOVIE: రామ్ చరణ్ కోసం సుకుమార్ చూపించిన ఈ లాజిక్ కనిపెట్టరా ?
ముందుండి ఈ పాటని హాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేశాడు రాజమౌళి. అయితే ఎక్కడ చూసినా దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్ తదితరులు మాత్రమే కనిపించారు. వారి పేరు మాత్రమే వినిపించాయి. కానీ ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఎక్కడా కనిపించలేదు. ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు. ఈ నేపథ్యంలో అసలు ఆర్ఆర్ఆర్ టీమ్ కి, దానయ్యకి మధ్య ఏం జరిగింది అని అందరూ ఆలోచించారు. అయితే తాజాగా నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడం పై దానయ్య స్పందించారు.
Advertisement
” ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, ఆర్ఆర్ టీం ఎవరితోనో నేను కాంటాక్ట్ లో లేను. కానీ నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది” అన్నారు డివివి దానయ్య. అయితే వీరి మధ్య కాంటాక్ట్ ఎందుకు లేదో మాత్రం చెప్పలేదు. అయితే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు ప్రమోషన్స్ కి దాదాపు 80 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఇంత ఖర్చు దానయ్యకు ఇష్టం లేదని.. అందుకే ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఇన్సైడ్ టాక్. ఏదేమైనా దానయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Read also: ఆస్కార్ అవార్డు ని నిజంగా అమ్ముకోవచ్చా ?? ఆలా చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?