Advertisement
ఆడవాళ్ళు రాత్రి అన్నం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. ఒకవేళ చేసారు అంటే మనం ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా మిగలకుండా పోతుందట. మరి స్త్రీలు అన్నం తిన్న తర్వాత ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అన్నం వృధా చేయడం అంటే పరబ్రహ్మను నిర్లక్ష్యం చేసినట్టే. అన్నాన్ని మనం దైవ సమానంగా భావిస్తూ వుంటాం. అన్నం వృధా చెయ్యటమే కాకుండా తిన్న తర్వాత కొన్ని నియమాలను పాటించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Advertisement
ఆ నియమాలని పాటిస్తే ఎంతటి దరిద్రం ఉన్న తొలగిపోయి అన్నానికి లోటు ఉండదు. ముఖ్యంగా అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్ లో చేతులు కడగకూడదు. అన్నం తినే సమయంలో ఎప్పుడైనా దగ్గు వస్తే అక్కడే కూర్చొని ఉమ్మి వేయకూడదు. ఇది పరమ దరిద్రాన్ని చూపిస్తుంది. భోజనం పూర్తయిన తర్వాత చాలామంది ఒక అగ్గిపుల్ల లేదంటే ఏదైనా పుల్లను తీసుకొని నోటిలోని పళ్ళ మధ్యలో గుచ్చుకోకూడదు. ఒకవేళ అంత ఇబ్బందికరంగా ఉంటే నీటితో పుక్కిలించాలి.
Advertisement
పళ్ళలో పుల్లలు గుచ్చడం దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత చాలామంది తిన్న ప్లేటు పక్కనే నడుం వాల్చి పడుకుంటారు. దీనివల్ల కూడా దరిద్ర దేవత కొలువుదీరుతుంది. భోజనం తర్వాత చేతులు కడుక్కుని ఆ నీటిని గట్టిగా విదిలిస్తూ ఉంటారు. ఆ నీటి బిందువులు చుట్టూ ఉన్న వస్తువులపై లేదంటే మనుషులపై పడతాయి. కాబట్టి చేయి కడిగిన తరువాత ఏదైనా బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. విదిలిస్తే దరిద్రం వస్తుంది.
also read;
అంటే సుందరానికి మూవీలో హీరో బామ్మగా నటించిన నటి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..?