Advertisement
ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ప్రతి సంవత్సరం ఉగాదిని చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో పలు దేవాలయాల్లో శోభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తారు. అయితే అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? ఈరోజు తెలుసుకుందాం.
Advertisement
Reqad also: ఈ సినిమాలు చేసి ఉంటే ఉదయ్ కిరణ్ తిరిగి నిలదొక్కుకునేవాడు!
హిందూ పంచాంగం ద్వారా ప్రాథమికంగా హిందూ పండుగలు, శుభ ముహూర్తాల గురించి వివరనాత్మక సమాచారాన్ని ఇస్తుంది. తిథి, నక్షత్రాలు అనేక విధాలుగా కలిసి యోగాలను ఏర్పరుస్తాయి. పంచాంగం అనేది “ఐదు అంగాలను” అని అనువదిస్తుంది. అంతేకాదు పంచ అంగ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. అంటే ఐదు అంశాలు. అవి రాసి, నక్షత్రం, తిథి, యోగం, కరణం.
పంచాంగ గణనాలు జాతకాలతో పోలిస్తే ఎక్కువ మంది ఆసక్తిని కలిగి ఉంటారు. దృక్ వాక్ అనేది రెండు రకాల పంచాంగాలు ఉన్నాయి. వీటిలో ఖగోళ వస్తువుల వాస్తవ స్థితిని నిర్ణయించేటప్పుడు దృక్ పంచాంగం అయితే వాక్ పంచాంగం అనేది గ్రహాల కదలికల ఆధారంగా గ్రహస్థానాలలో నిర్ణయించే ఉజ్జయింపు పద్ధతి. నేటి పంచాంగం అనేది జ్యోతిష్య శాస్త్ర రోజు వారి సమాచారాన్ని కలిగి ఉన్న పంచాంగం. ఇది గణనలను రాశి, నక్షత్రం, తిథి, యోగం, కరణంలను ఉపయోగించి భవిష్యత్తును అంచనా వేస్తుంది.
Advertisement
Read also: రైళ్ల పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు ఉంటాయి ? అవి లేకుంటే కలిగే నష్టం ఇదేనా ?
కాల పురుషుడి గురించి…
ఇది భవిష్యత్తు గురించే సమాచారం అందించే గ్రంథం మాత్రమే కాదు, దీని వెనక మతపరమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. శ్రీ మహావిష్ణువు అయినా కాలపురుషుడిని గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. భగవంతుని కాలాన్ని లేదా కాల పురుషుడిని ఆరాధించడం అంటే ఆయనకు నివాళులు అర్పించినట్లే. వాస్తవానికి మన జీవితంలో సమయం యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని ప్రతిక్షణం చక్కగా జీవించాలి. సమయం ఆటుపోట్లు తిరుగులేనివి. ఎవరి కోసం వేచి ఉండవు. మన జీవితం ఎలా సాగుతుందో మనలో ఎవరికీ తెలియదు. జీవితం అనేది పరిమితంగా ఉంటుంది. జీవితంలో సమయం ఎప్పుడూ విలువైనదే. ఎప్పుడూ ఎవరిని ఏ జీవిత కాలాన్ని విసిరి వేస్తుందో ఎవరికీ తెలియదు. మన జీవితాలపై సమయం ప్రభావం నుండి మనం ఎప్పటికీ తప్పించుకోలేము.