Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మోహన్ బాబు అంటే తెలియని వారు ఉండరు. వీరిద్దరూ ఒకే తరానికి చెందిన హీరోలు. అప్పట్లో వీరి సినిమాలతో చాలాసార్లు పోటీ పడ్డారు. అలాంటి మోహన్ బాబు మరియు చిరంజీవి మధ్య విభేదాలు ఉన్నాయని అనేక వార్తలు వినిపించాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. తనకు చిరంజీవికి ఎలాంటి విభేదాలు లేవని మరోసారి క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాలు బయట పెట్టారు..
Advertisement
also read: Sr Ntr Family Members and Details: ఎన్టీఆర్ ఎనిమిది మంది కొడుకులు… ఎవరు ఏం చేస్తారో తెలుసా…?
మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనే మాటల్లో నిజం లేదని, వీలు కుదిరినప్పుడల్లా మేమిద్దరం మాట్లాడుకుంటామని అన్నారు. ఇక వజ్రోత్సవాల్లో జరిగిన వివాదం పై ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తుంటాయి.. ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు.. మేము చాలా ఆనందంగా ఉన్నాం ప్రస్తుత పరిస్థితులు అనుకూలించకపోతే అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయులు మధ్య చిన్న చిన్న పట్టింపులు వస్తూ ఉంటాయి. వాటిని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఈ విషయంపై మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని బదిలిచ్చారు.
Advertisement
also read: Sr Ntr Family Members and Details: ఎన్టీఆర్ ఎనిమిది మంది కొడుకులు… ఎవరు ఏం చేస్తారో తెలుసా…?
మా ఎన్నికల విషయంలో మీ ఇద్దరి మధ్య కాస్త ప్రతికూల వాతావరణం ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి.. అనే ప్రశ్నకు.. అలా ఎందుకు జరిగిందో ..? అది తన తప్ప నా తప్ప..? అనేది ఇప్పుడు చర్చించాలనుకోవడం లేదు.. ఈ మధ్యకాలంలో మేము వందల సార్లు ఎదురుపడ్డాం. ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుకున్నాం.. బయట వాళ్లు మా మధ్య గొడవలు ఉన్నాయని అనుకోవడం, వార్తలు రాయడం తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు.
also read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!