Advertisement
ఇద్దరు కొడుకులు తమ తల్లికి రెండో పెళ్లి చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచి జిల్లాలో చోటుచేసుకుంది. వలయఎంమట్టు గ్రామానికి చెందిన సెల్వి అనే మహిళకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు భాస్కర్, చిన్న కొడుకు వివేక్ లు. చిన్నతనంలోనే తమ తండ్రిని కోల్పోయారు. 2009లో వారి తండ్రి చనిపోయాడు. భాస్కర్ డిగ్రీ చదువుతుండగా, తన టీచర్ మీ అమ్మకు రెండో పెళ్లి ఎందుకు చేయకూడదని ప్రశ్నించడంతో భాస్కర్ చాలా బాధపడ్డాడు.
Advertisement
Read also: గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్ భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?
Read also: సంక్రాంతి బరిలో విడుదలై డిజాస్టర్లు గా మిగిలిన సినిమాలు ఏవంటే ?
Advertisement
ఉద్యోగంలో చేరిన తర్వాత భాస్కర్ పుస్తకాలు బాగా చదివేవాడు. పెరియార్ రాసిన పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల అందులో ఉండే వితంతు పునర్వివాహాల గురించి చదివి స్ఫూర్తి పొందాడు. ఇంట్లో తన తల్లి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటుందని, తల్లికి మళ్లీ ఎందుకు పెళ్లి చేయకూడదు అనే విషయంలో బాగా ఆలోచించాడు. తమ్ముడు వివేక్ తో చర్చించి ఇద్దరు తమ నిర్ణయాన్ని తల్లికి చెప్పారు. సెల్వి కొడుకుల ఆలోచనకు ఆశ్చర్యపోయింది. మొదట ఇద్దరు కొడుకులను తిట్టిపోసిన ఆ తర్వాత కొడుకు రోజు బుజ్జగించి బ్రతిమాలడంతో పిల్లల కోసం ఒప్పుకుంది.
ఇతరులు తన గురించి ఏమనుకుంటే ఏమని, తన పిల్లలు సంతోషంగా ఉండటమే కావాలని అనుకుంది. చివరి రోజుల్లో పిల్లలపై ఆధారపడకుండా తనకంటూ ఓ తోడు ఉండాలనుంది. భర్త చనిపోయాక తనకు ఎదురైన అవమానాలను, సూటిపోటి మాటలను గుర్తు చేసుకుంది. తాను ఎందరికో ఆదర్శం కావాలని నిర్ణయించుకొని పెళ్లికి ఒప్పుకుంది. ఏలుమలై అనే రైతుతో సెల్వి పెళ్లి జరిగింది. పెళ్లికి బంధువులు ఎవరూ రాకపోయినా ఇద్దరు కొడుకులు అమ్మకు మరో పెళ్లి చేసి రుణం తీర్చుకున్నారు.
Also Read: కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న టాలీవుడ్ స్టార్లు వీళ్లే.!