Advertisement
ప్రపంచంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణమైన టీ హబ్- 2.0 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ టీ హబ్- 2.0ను ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. యువ వ్యాపారవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా టీ హబ్ నీ రూపొందించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నవభారత స్టార్టప్ నుంచే రూపుదిద్దుకుంటుందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
Advertisement
దేశంలో ప్రతిభావంతులను ఆకర్షించడం కోసం 2015 లో టీ హబ్ ను ప్రారంభించగా, అది దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఎదిగిందని కేసీఆర్ తెలిపారు. దేశంలోని నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఉత్తమంగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు.
Also Read: RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!
2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో టీ హబ్ మొదటి దశను నిర్మించారు. దానికి అనూహ్యస్పందన రావడంతో, తెలంగాణ ప్రభుత్వం టి హబ్ రెండో దశను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోకెల్లా రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ గా ఇది గుర్తింపు పొందింది.
Advertisement
టీ హబ్ 2.0 లో మొదటి అంతస్థును అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి అయోగ్ భాగస్వామ్యంతో ఏర్పాటైన సిఐఐ, ఏఐసి టి హబ్ ఫౌండేషన్ కు కేటాయించారు. ఆర్టిఫిషియల్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ను ప్రోత్సహించడం కోసం ఏడో అంతస్తును సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేటాయించారు. ఎనిమిది , తొమ్మిదో అంతస్తులను జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జికా) ప్రాజెక్టుతోపాటు సమాజంపై ప్రభావం చూపే స్టార్టప్ , యువ వ్యాపారవేత్తలకు కేటాయించారు.
‘స్పేసెస్’ అనే కొరియన్ సంస్థ టీ హబ్ రెండో దశ భవనాన్ని ‘శాండ్ విచ్’ నమూనాలో డిజైన్ చేసింది. పది అంతస్తుల్లో టీ హబ్ రెండో దశ నిర్మాణం కాగా, ప్రస్తుతం 5 అంతస్తుల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివర నెలకు ఓ అంతస్తు చొప్పున భవనం మొత్తం అందుబాటులోకి రానుంది. రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ లో టీ హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?