Advertisement
అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ మధ్యనే పెళ్లి చేసుకొని తల్లి కూడా ఐన ఈ స్టార్ బ్యూటీ కొన్నాళ్లు ఇండస్ట్రీ నుండి గ్యాప్ తీసుకుంది. దాదాపు రెండేళ్లు సినిమాల నుంచి దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్ ఎప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.
Advertisement
ఆఫ్టర్ మ్యారేజ్ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ గా నటించిన చిత్రం “ఘోస్టీ”. కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ తో పాటు కోలీవుడ్ నటుడు యోగిబాబు నటించారు. ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాలో రాధిక, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కె ఎస్ రవికుమార్, ఊర్వశి కూడా పలు పాత్రల్లో నటించారు. ఈ సినిమాని తెలుగులో గంగ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. కాజల్ నటించిన ఘోస్టీ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Read also: TOLLYWOOD TELUGU MOVIES: పాత సినిమా టైటిల్స్ తో ఇప్పటి దాకా వచ్చిన వచ్చిన 10 టాలీవుడ్ మూవీస్ !
కథ మరియు వివరణ:
హారర్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో కాజల్ లేడీ ఇన్స్పెక్టర్ రోల్ చేశారు. ఇందులో కాజల్ పేరు ఆరతి. దర్శకుడు జేయస్ రవికుమార్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ దాస్ పాత్రలో నటించారు. ఆరతి తండ్రి దాస్ ను అరెస్టు చేసి జైల్లో వేస్తారు. అయితే జైలు నుంచి తప్పించుకున్న దాస్ ను ఎలాగైనా పట్టుకుంటానని ఆరతి శపథం చేస్తుంది. దాస్ ని పట్టుకునే క్రమంలో అతడిని షూట్ చేయబోయి మరొకరిని షూట్ చేస్తుంది ఆరతి. అయితే ఆమె షూట్ చేసింది ఎవరిని? ఆత్మలు ఎందుకు వచ్చాయి? ఆరతి తండ్రిపై పగ తీర్చుకోవడానికి వచ్చిన దాస్ ఏం చేశాడన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Advertisement
ఈ మూవీలో ఆరతితోపాటు పోలీస్ ఆఫీసర్లుగా సీనియర్ నటి ఊర్వశి, సత్యం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అలాగే రాధిక శరత్ కుమార్ అతిధి పాత్ర పోషించారు. ఇక సామ్ సీఎస్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. సినిమాలోని కొన్ని సాగదీత సన్నివేశాలు బోరింగ్ గా అనిపించాయి. కామెడీ సన్నివేశాలు ఆకట్టుకోలేకపోయాయి. అయితే మూవీలోని ట్విస్టులు గత సినిమాలలో చూసినట్లే అనిపిస్తాయి. ఇక కాజల్ మరోసారి తనదైన నటనతో మెప్పించిందనే చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది. హర్రర్ కామెడీ అనే జోనర్ ఉన్న సినిమాలని మనం చాలా చూశాం. ఇది కూడా అలాంటి సినిమానే. కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. స్క్రీన్ ప్లే చాలా బలహీనంగా ఉంది. ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకి అసలు కనెక్ట్ కాలేదు. ఓవరాల్ గా ఒక రొటీన్ చిత్రం అని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ
ప్రేక్షకులకి కనెక్ట్ కాని ఎమోషన్స్
ప్లస్ పాయింట్స్:
కాజల్ అగర్వాల్
చాలామంది పాపులర్ నటీనటులు ఉండడం
రేటింగ్: 2.5/5
Read also: VENUS WAMY WIFE NAME: వేణు స్వామి భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?