Advertisement
సాధారణంగా కొంతమందికి చిన్న జాబ్ వస్తేనే కళ్ళు నెత్తికెక్కుతాయి. జాబ్ వచ్చింది కదా అని వారు చేసే పనిని సరిగ్గా చేయకుండా అడ్డదారులు తొక్కుతుంటారు. అలాంటి ఈ సమాజంలో ఈ కలెక్టర్ ఏమో చేసిన పని చూసి అందరూ శభాష్ అంటున్నారు.. ఇంతకీ ఆమె ఏం చేసిందో చూద్దాం.. మద్యం ఆరోగ్యానికి హానికరం.. దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అయితే మద్యం ఎందుకు తాగుతున్నారని కొంతమందిని అడిగితే కొందరేమో బాధలను మర్చిపోవడానికి, మరికొందరు రిలాక్సేషన్ కోసం తాగుతున్నామని చెబుతున్నారు.
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 23.03. 2023
కారణం ఏదైనా కానీ మద్యం బాటిల్ మాత్రం ఖాళీ చేస్తున్నారు. చివరికి అనారోగ్యాల బారిన పడి తీరని కష్టాల్లో పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడం కోసం అనకాపల్లి జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి మునగపాక మండలంలో విముక్తి అనే పైలెట్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. మద్యం మాన్పించడం కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఓ రోజు భూముల సర్వే కోసం మంగళవారం మండలానికి వచ్చిన జేసీ కల్పన, తాటిపల్లి గ్రామంలోని ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడింది.
Advertisement
also read:ఆస్ట్రేలియా వెళ్లిన భర్త..బెడ్ రూంలో భార్య ఎంత పని చేసిందంటే..?
మద్యం మానేయడం వల్ల కుటుంబంలో వచ్చిన మార్పులు తెలుసుకుంది. వారి పిల్లలను పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని ఈ ప్రాజెక్టు సక్సెస్ కావడానికి కృషి చేసిన ఏఎన్ఎం సుజాతను కూడా అభినందించింది. దీంతో ఆ కుటుంబీకులు చాలా ఆనందపడ్డారు. అంత పెద్ద అధికారి అయినా మా ఇంటికి వచ్చి మా యోగ క్షేమాలు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మరి జెసి కల్పనా పై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి..
also read:వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ వెంటనే కన్ఫామ్ అవ్వాలంటే.. ఈ ట్రిక్స్ పాటించాల్సిందే..?