Advertisement
చాలా కుటుంబాల్లో అడపిల్ల, మగపిల్లాడు ఉంటే ఆడపిల్లకు కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. ఇక మిగిలిన ఆస్తి ఏమైనా ఉంటే అది అబ్బాయికే చెందుతుందని భావిస్తారు.. మరి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినా కానీ , పుట్టింటి ఆస్తిలో సగం వాటా ఉంటుందా.. లేదా అనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న.. దీనిపై హైకోర్టు తీర్పు ఏమిచ్చిందో ఇప్పుడు చూద్దాం..
Advertisement
బొంబాయి హైకోర్టు చెప్పిన దాని ప్రకారం .. ఆడపిల్లలకు పెళ్లి సమయంలో కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసినా, కానీ ఆస్తిలో సగం వాటా ఉంటుందని స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు లోని గోవా బెంచ్ తీర్పును వెలువరించింది. పెళ్లిలో ఇంటి ఆడపిల్లకు కట్నం ఇచ్చారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బెంచ్ అభిప్రాయపడింది.
Advertisement
also read: CM KCR Rare unseen Photos: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలుపెరుగని యోధుడు సీఎం కెసిఆర్ రేర్ పిక్స్
అలాగే కట్నం ఇచ్చారని కారణంతో ఆడపిల్లలకు ఆస్తిలో లేదనడం అసలైన అర్థం కాదని స్పష్టం చేసింది. ఒక ఇంట్లో నలుగురు సోదరులు,నలుగురు సోదరీమణులకు ఆస్తి బదిలీ జరిగింది. ఆ విషయాన్ని పెద్ద కుమార్తె న్యాయస్థానంలో సవాలు చేసింది. దివంగత తండ్రిది తనకు వాటా ఉంటుందని తెలియజేస్తూ ఆమెను వారసురాలిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
also read: హిట్ 2 సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..విలన్ ఇంట్లో ఉండగా ఇది ఎలా సాధ్యం ?