Advertisement
Telugu Comedian Sunil Daughters: కమెడియన్ సునీల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలలో నటించిన సునీల్.. ఆ తర్వాత కమెడియన్ గా మారి నువ్వే కావాలి, చిరునవ్వుతో, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి సినిమాలలో నటించాడు. ఆ సినిమాలు సూపర్ హిట్ అవడంలో సునీల్ కామెడీ కూడా కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత కమీడియన్ గా ఒక వెలుగు వెలిగి తన కెరీర్ ను మార్చుకున్నాడు సునీల్. తన కామెడీ టైమింగ్ తో ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం వంటి సీనియర్ స్టార్ కమెడియన్స్ ని కూడా సైడేశాడు అనడంలో సందేహం లేదు.
Advertisement
Read also: TSPSC PAPER LEAKAGE : రేణుక ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి!
కమెడియన్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత హీరోగా మారి సినీప్రియులను అలరించాడు. ఆ తర్వాత హీరోగా కొన్నేళ్ల పాటు కెరీర్ బాగానే సాగినా.. తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా మారారు. ఇక ఇప్పుడైతే విలన్ పాత్రలలో మెప్పిస్తున్నారు సునీల్. అయితే సునీల్ ను ఎన్నో సినిమాలలో చూసిన తెలుగు ప్రేక్షకులు ఆయన ఫ్యామిలీని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఆయన వ్యక్తిగత విషయాలు అంతగా మీడియా ముందుకు రావు. అంతేకాదు ఆయన హీరోగా కొనసాగిన సమయంలోను ఏ వేడుకలలో సునీల్ కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. సునీల్ సొంత ఊరు ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భీమవరం. సునీల్ తన తండ్రిని ఐదు సంవత్సరాల వయస్సులోనే కోల్పోయాడు.
Advertisement
దీంతో తల్లి సంరక్షణలోనే పెరిగి పెద్దయ్యాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే సునీల్ వివాహం జరిగింది. వారి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ తన పిల్లల గురించి మాట్లాడారు. సునీల్ కు ఇద్దరు పిల్లలు.
ఒక పాప, బాబు. పాప పేరు కావ్య కుందన. ఆ చిన్నారి పదవ తరగతి పూర్తి చేసింది. ఇప్పుడే కాలేజీలోకి ఎంటర్ అవుతుందని చెప్పారు. ఇక బాబు ఆరవ తరగతి చదువుతున్నాడట. అయితే పిల్లలని సినిమాలలోకి తీసుకు వస్తారా? అని అడిగితే మాత్రం అది తన చేతులలో లేదని సమాధానం ఇచ్చారు. వాళ్ల జీవితాన్ని ఎలా డిసైడ్ చేసుకుంటే అలా ముందుకెళ్తారని అన్నారు.
Read also: SRI HARI AND RAM CHARAN: 15 సంవత్సరాల క్రితం రామ్ చరణ్ గురించి శ్రీహరి చెప్పిన మాటలు నిజమయ్యాయి !