Advertisement
మనం తరచుగా వినే పదం టిఆర్పి రేటింగ్. టీవీలు చూసే వాళ్లకు ఇది కాస్త ఎక్కువ పరిచయమే కదా..? అసలు టిఆర్పి రేటింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చూస్తారో ఒక్కసారి చూద్దాం. దాన్ని పూర్తి వివరణ టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఇది ఏ ఛానల్ లేదా ప్రోగ్రాంను ఎక్కువగా ప్రేక్షకులు చూస్తున్నారో చెప్పే సాధనం. సదరు చానల్ లేదా అందులో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ కు ఉన్న ప్రజాధరణ చెప్తుంది. ఇక చూసేవాళ్ళు ఎన్నిసార్లు చూస్తున్నారో కూడా చెప్తుంది.
Advertisement
READ ALSO : Sr. NTR: నందమూరి తారక రామారావు గారి జీవితాన్ని తల్లకిందులు చేసిన ఒకే ఒక్క చిన్న సంఘటన !
దీనితో చానల్లో పెట్టుబడి పెట్టే వాళ్లకు ఒక క్లారిటీ ఉంటుంది. యాడ్స్ ఇచ్చే వాళ్లకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. INTAM అలాగే DART అనే భారతీయ ఏజెన్సీల ద్వారా దీన్ని లెక్కిస్తారు. ప్రస్తుతం INTAM ద్వారా టిఆర్పి కొలుస్తున్నారు. దూరదర్శన్ ఆడియన్స్ రీసెర్చ్ టీవీ రేటింగ్ సైనా DART ద్వారా గతంలో చూసేవారు. ఆ టైంలో దూరదర్శన్ మాత్రమే అందుబాటులో ఉండేది. కాబట్టి ఆ ఛానల్ మాత్రమే చూశారు. అయితే DART ఉనికిలో ఇప్పటికీ ఉంది.
Advertisement
READ ALSO : ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో యాక్టర్ షఫీ ఎలాంటి పనులు చేసేవాడంటే ?
సెలెక్ట్ చేసిన వ్యక్తులను కాకుండా ర్యాండంగా దీన్ని లెక్కిస్తారు. వివిధ ఛానల్ లు అలాగే టీవీ ప్రోగ్రామ్ ల గురించి వారిని ప్రశ్నిస్తారు. ఎలక్ట్రానిక్ పద్ధతులను కూడా ఉపయోగించి లెక్కిస్తారు. ఏదైనా ప్రోగ్రాం టిఆర్పి పెరుగుదల లేదా తగ్గుదల అనేది నేరుగా ప్రోగ్రాం వచ్చే టీవీ ఛానల్ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే వినూత్నంగా ఉండే కార్యక్రమాల మీద ఎక్కువగా చానల్స్ దృష్టి సారిస్తాయి. ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలను రూపొందిస్తే మంచి లాభం ఉంటుంది.