Advertisement
venkateswara swamy pooja Vidhanam Telugu: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. ఆపదమొక్కులవాడు, అనాధ రక్షకుడు, కొలిచిన వారికి కొంగుబంగారమైన శ్రీనివాసుడు, కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు.. భక్తుల పాలిట కల్పవృక్షంగా స్వామివారు పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల వారే కాక దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. అయితే చాలామంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ, ఆ కోర్కెలు తీరాలని ముడుపులు కడతారు. అయితే ఈ ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. స్వామివారికి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది.
Advertisement
Read also: CM KCR RARE UNSEEN PHOTOS: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలుపెరుగని యోధుడు సీఎం కెసిఆర్ రేర్ పిక్స్
Advertisement
అది ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది. అయితే ఋణ, ఆరోగ్య సమస్యలు తీరాలంటే ఆ కలియుగ దైవానికి ఏ విధంగా ముడుపు కట్టాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకునికి మీ కోరికని చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలని కోరుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఒక తెల్లని కొత్త బట్టని తీసుకొని.. దానిని తడిపి పసుపు రాసి ఆరబెట్టాలి. ఆ తర్వాత ఆ తెలుపు బట్టకి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టాలి. అలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏమిటి, ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకోవాలి.
అలా డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి. అలా ముడుపును పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వరా స్వామి అష్టోత్తరం ని చదవాలి. 108 గోవింద నామాలు చదవాలి. ఆ తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. స్వామివారికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. అలా హారతి ఇచ్చిన తర్వాత ముడుపు మీ పని అయ్యేవరకు స్వామి ముందే ఉంచాలి. కోరిక తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకొని తిరుమల కి దర్శనానికి వెళ్లి మడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామి వారి హుండీలో వేయాలి. ఇలా భక్తిగా, నమ్మకంగా చేసిన వారి కోరిక తప్పక నెరవేరుతుందని పెద్దల నమ్మకం.
Read also: SR. NTR: నందమూరి తారక రామారావు గారి జీవితాన్ని తల్లకిందులు చేసిన ఒకే ఒక్క చిన్న సంఘటన !