Advertisement
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్-శ్రీలంక మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివిస్ 198 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసింది. తోలుత బ్యాటింగ్ చేసిన కివిస్ జట్టు 274 పరుగులు చేయగా.. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక, కివిస్ పేసర్ల దాటికి 76 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షిప్లీ 5 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. దాంతో లంక వరల్డ్ కప్ ఆశలు క్లిష్టతరంగా మారాయి.
Advertisement
READ ALSO : Anchor Shyamala Photos: ఒక్కాసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ శ్యామల ! ఫోటోలు వైరల్!
ఇదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక టీం బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ లో ఈ ఘటన జరిగింది. బ్లెయిర్ టిక్నర్ వేసిన ఈ ఓవర్ లో నాలుగో బంతిని లంక బ్యాటర్ కరుణరత్నే ఆడాడు. సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బంతిని వెంటనే అందుకున్న కివిస్ ఫీల్డ్ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేశాడు. వెంటనే బంతిని అందుకున్న టిక్నర్ స్టమ్స్ ను పడగొట్టాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశాడు. టిక్నర్ బేయిల్స్ పడగొట్టే సమయానికి కరుణరత్నే క్రిజుకు దూరంగానే ఉన్నాడు.
Advertisement
దాంతో అతడు అవుట్ అని అందరూ భావించారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బంతి బెయిల్స్ కు తగలగానే వెలగాల్సిన జింగ్ బెయిల్స్ వెలగలేదు. దీంతో రూల్స్ ప్రకారం జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా థర్డ్ అంపైర్ నాట్ అవుట్ గా ప్రకటించాడు. అసలు విషయం ఏంటంటే ఆ బేల్స్ తో చార్జింగ్ లేదట. దాంతో కివీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
READ ALSO : TILAPIA FISH AND BENEFITS, IMAGES IN TELUGU: “టిలాపియా” ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!