Advertisement
పోషక విలువలు అధికంగా ఉండే జీడిపప్పు ధర ఆకాశంలో ఉంటుంది. తక్కువ రకం జీడిపప్పును కొనాలంటేనే సామాన్యులకు సాధ్యం కాదు. వీటి కాస్ట్ కాస్ట్లీ గానే ఉంటుంది. వీటి ధర దాని క్వాలిటీ పై ఆధారపడి ఉంటుంది. తక్కువ క్వాలిటీది 600 రూపాయల విలువ చేస్తే.. ఎక్కువ క్వాలిటీది 1000 పైనే ఉంటుంది. జీడిపప్పులో ఉండే విటమిన్ – ఇ ధమనులలో ఫలకం ఉత్పత్తిని నిరోధించి రక్తప్రసరణను తగ్గిస్తుంది. అందుకే ఇమ్యూనిటీ కోసం జీడిపప్పు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే మన దేశంలోని ఒక ప్రాంతంలో కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా.. ఇది నిజమే. కేజీ 30 రూపాయలే..! ఇంతకీ ఎక్కడ అంటారా..? జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్ లోని జంతార అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామం. దీన్ని “జార్ఖండ్ జీడిపప్పు నగరం” గా పిలుస్తారు.
Advertisement
Read also: ANCHOR SHYAMALA PHOTOS: ఒక్కాసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ శ్యామల ! ఫోటోలు వైరల్!
Advertisement
ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్వాలిటీ జీడిపప్పును కొనుగోలు చేసి తీసుకు వెళ్తుంటారు. ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచే దళారులు అధికంగా కొని బయట ప్రాంతాల్లో 100 రెట్లు అధిక ధరకు అమ్ముకుంటారు. అయితే ఇంత తక్కువ ధరకు ఈ గ్రామంలో ఎలా విక్రయిస్తున్నారంటే.. ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. ఈ తోటల్లో పనిచేసే మహిళలు, పిల్లలు అత్యంత తక్కువ ధరకే జీడిపప్పును అమ్మేస్తుంటారు. అక్కడి నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీశాఖ గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ చెప్పి జీడి తోటలను పెంచే విధంగా ప్రోత్సహించింది.
దీంతో ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. అంతేకాదు రైతులకు ప్రభుత్వ తరపు నుంచి ప్రోత్సహించారు. ఇక అప్పటినుంచి రైతులు జీడిపప్పు సాగుపై దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఇందుకోసం జంతార జిల్లా డిప్యూటీ కమిషనర్ కృపానంద ఝా ఎంతగానో కృషి చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. జీడిపప్పును అక్కడి రైతులు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తుంది. ఇంతగా జీడిపప్పు పండుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంట్ లేదు. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు.. జీడిపప్పు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.
Read also: కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు ఉంటాయి?