Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై టిడిపి ఎప్పటికప్పుడు విమర్శనాస్త్రాలు చేస్తూ ఉంటుంది.. దీనికి దీటుగా అధికార పార్టీ కూడా బదిలీస్తూ వస్తోంది. ఈ తరుణంలోనే టిడిపికి అమ్ముడు పోయారని అభియోగంతో ఇటీవలే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుండి సస్పెండ్ అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత టిడిపి తనతోనే బేరసారాలు సాగించిందన్నారు.
Advertisement
also read: కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు ఉంటాయి?
తనకు తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ పార్టీకి చెందిన నేతలు బేరాలు ఆడారని రాపాక వరప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని, కానీ నేను అలా చేయలేదు అంటూ తెలియజేశారు. రాజోలులో ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన తన మిత్రుడు ఏఎస్ఎన్ రాజుతో టిడిపి నాయకులు బేరసారాలు వాడారని తెలియజేశారు. అసెంబ్లీ దగ్గర కూడా తనతో బేరాలు చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారని, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారంటూ ఆయన పేర్కొన్నారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలే మన రాపాక, సిగ్గు శరీరం వదిలేసి ఉంటే పది కోట్లు వచ్చి ఉండేవని అన్నారు.
Advertisement
also read: Anchor Shyamala Photos: ఒక్కాసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ శ్యామల ! ఫోటోలు వైరల్!
తను జగన్ ను నమ్మాను కాబట్టే తెలుగుదేశం పార్టీ ఆఫర్లను తిరస్కరించారని తెలియజేశారు. కాగా మూడు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, క్రాస్ ఓటింగ్ చోటు చేసుకోవడంతో టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి , కోటం శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలోనే రాపాక వరప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.