Advertisement
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు రాజకీయ వరసత్వాన్నే కాదు, సినీ వారసుడిగా సినిమా రంగంలో అద్వితీయమైన నటనతో అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సాధించారు బాలకృష్ణ. ఇక బాలకృష్ణకి వసుంధర దేవితో 1982 డిసెంబర్ 8వ తేదీన వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాహానికి సంబంధించిన ఒక విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాలకృష్ణ పెళ్లి రోజు ఆయన తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణ లేకపోవడంపై అప్పట్లో పెద్ద చర్చ సాగింది. కానీ దీనిపై చాలామందికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం తెలియదు. అసలు బాలకృష్ణకు పెళ్ళి ఎవరు కుదుర్చారు? ఆ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదు? దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also: RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్
Advertisement
నందమూరి తారక రామారావు సినిమాలకు కాస్త విరామం ఇచ్చి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రాజకీయాలలోకి వచ్చిన తర్వాత చాలా బిజీగా మారిపోయారు. అయితే ఆయన పార్టీ స్థాపించడానికంటే ముందే రామోజీరావు ఈనాడు పేపర్ కి అధినేతగా ఉన్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. అలా ఓ రోజున రామోజీరావు ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ కి ఓ సందర్భంలో ఓ అమ్మాయి టీ తీసుకువచ్చి ఇచ్చింది. ఆ టీ తీసుకున్న ఎన్టీఆర్ ఈ అమ్మాయి ఎవరు అని రామోజీరావును అడిగారట. దీంతో రామోజీరావు నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురు అని చెప్పారట. దేవరపల్లి సూర్యరావు శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ పోర్ట్ కి అధినేత. సహజంగానే వసుంధర దేవి కోట్ల ఆస్తికి వారసురాలు.
వసుంధర దేవి అంటే రామోజీరావు, ఆయన సతీమణికి చాలా ఇష్టమట. అందుకే తరచూ వీరి ఇంట్లోనే ఆమె ఉండేదట. ఈ క్రమంలోనే రామోజీరావు మరియు ఎన్టీఆర్ బాలకృష్ణ వివాహం గురించి కూడా చర్చించి ఆ అమ్మాయి బాలకృష్ణకి అయితే ఎలా ఉంటుందని అడిగారట. దీంతో రామోజీరావు కూడా చాలా బాగుంటుందని ఆనందపడ్డాడట. ఇంకేముంది వారం రోజులలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పెళ్ళి కూడా పెట్టేసుకున్నారు. అయితే పెళ్లికి మాత్రం ఎన్టీఆర్, హరికృష్ణ హాజరు కాలేదట. దీంతో ఆ పెళ్లి సత్సంగాన్ని మొత్తం రామోజీరావు దగ్గర ఉండి చూసుకున్నారట. వారు బాలకృష్ణ పెళ్ళికి హాజరు కాకపోవడానికి కారణం ఎన్టీఆర్, హరికృష్ణ ఓ అర్జంట్ మీటింగులో ఉండడమేనట. ఇక బాలకృష్ణ పెళ్లి పెద్దగా రామోజీరావు దగ్గరుండి వారి పెళ్లి చేయించారు.
Read also: పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!