Advertisement
కెరీర్ ప్రారంభంలో రామ్ చరణ్ ఆరెంజ్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. సినిమాలో చరణ్ కు జోడిగా జెనీలియా హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నాగబాబు నిర్మించారు. ప్రేమకథా చిత్రంగా పేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చగా, ఆడియోకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమాకు మొదటి రోజే నెగటివ్ టాక్ మొదలవడంతో పాటు చరణ్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
Advertisement
READ ALSO : కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదల వెనక ఇంత కథ ఉందా ?
కానీ ఈ సినిమాను ఇప్పటికీ టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఆరెంజ్ తమ ఫేవరెట్ సినిమా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. చరణ్ సతీమణి ఉపాసనకు కూడా ఆరెంజ్ సినిమా అంటే చాలా ఇష్టమట. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి సినిమా తర్వాత హీరోల క్రేజ్ పీక్స్ కు వెళ్ళిపోతుంది. అలానే చరణ్ విషయంలో కూడా జరిగింది. మగధీరలో విరోచిత పోరాటం చేసిన చరణ్ ను లవర్ బాయ్ లుక్ లో చూసి ప్రేక్షకులు నిరాశ చెందారట.
Advertisement
READ ALSO : టాలీవుడ్ లో 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ సాధించిన హీరోలు ఎవరంటే ?
అంతేకాకుండా సినిమా పాటలు బ్లాక్ బస్టర్ అవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ ఎంతమందినైనా ప్రేమించవచ్చు అనే కాన్సెప్ట్ కూడా అప్పుడు జనాలకు ఎక్కలేదు. ప్రేమిస్తానని చెప్పడం పెళ్లి వద్దని చెప్పడం ప్రేక్షకులకు అసలు అర్థం కాలేదు. అంతేకాకుండా సినిమాలో జెనీలియా యాక్టింగ్ చూసి ఓవర్ యాక్టింగ్ అనుకున్నారు. జెనీలియా వల్లే సినిమా పోయిందని కూడా అన్నారు. ఇక ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ కంటే అప్డేట్ గా తీశారని, అందువల్లే ప్రేక్షకులకు ఎక్కలేదని కూడా విశ్లేషకుల అభిప్రాయం.
READ ALSO : ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !