Advertisement
ఏపీ వీధుల్లో బీజేపీతో కొట్లాడుతున్నా.. ఢిల్లీ వీధుల్లో మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది వైసీపీ. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా సఖ్యతతో ముందుకెళ్తోంది. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి. అయితే.. బీజేపీ పాత మిత్రుడు చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ, రాష్ట్ర నేతలు గత అనుభవాల దృష్ట్యా ఇది కుదరదని తెగేసి చెప్తున్నారు. అయితే.. బాబు మాత్రం ఢిల్లీ పెద్దల సైడ్ నుంచి అంతా సైలెంట్ గా చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
Advertisement
ఆమధ్య మోడీని కలవడం.. మిత్రుల మాదిరి ఇద్దరూ కలుపుకోలుగా మాట్లాడుకోవడాన్ని టీడీపీ గట్టిగానే ప్రచారం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీని దెబ్బకొట్టాలంటే టీడీపీ ఎగస్ట్రా సపోర్ట్ కచ్చితంగా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 2014 సీన్ ను రిపీట్ చేయాలనే భావనలో చంద్రబాబు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. సందర్భం చూసుకుని బీజేపీకి దగ్గరయ్యే ఏ అవకాశాన్ని వదులుకోకుండా బాబు ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
Advertisement
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రత్యేక నాణెం విడుదల యాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు చంద్రబాబు. లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై టీడీపీ పొలిట్ బ్యూరో మీకు ధన్యవాదాలు తెలిపింది.. నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు చంద్రబాబు.
ఇక జగన్ ఢిల్లీ టూర్లు మిస్టరీగా మారాయి. ఈ నెల 17న ఢిల్లీ వెళ్లిన ఆయన.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజాగా మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. రెండు వారాల్లో జగన్ ఢిల్లీలో పర్యటన పెట్టుకోవడం ఇది రెండోసారి. దీంతో ఈ టూర్ లో జగన్ ఎవరెవరిని కలవబోతున్నారు, ఏం చర్చించబోతున్నారనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఏదిఏమైనా అటు చంద్రబాబు, ఇటు జగన్.. సమయ దొరికినప్పుడల్లా మోడీకి హాయ్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ ఎటు టర్న్ తీసుకుంటాయో చూడాలి.