Advertisement
సాధారణంగా సినిమాల్లో ఒక హీరో కోసం కథ రాసుకోవడం.. ఆ తర్వాత ఆ సినిమాను వేరే హీరోతో తెరకెక్కించడం సర్వసాధారణం. దర్శకులు ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని వారి బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా కథని రాసుకుంటారు. ఇక అంతా ఓకే అయ్యి సినిమా పట్టాలు ఎక్కితే పరవాలేదు కానీ.. అలా కాకపోతేనే మరో హీరోతో ఆ సినిమా పట్టాలు ఎక్కుతుంది. దానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కానీ ఎస్ఎస్ రాజమౌళి విషయంలో మాత్రం దీనికి భిన్నం. ఆయన ఒక హీరోతో సినిమా చేయాలనుకుంటే ఆ హీరోతోనే చేస్తాడు. లేదంటే ఆ కథని పక్కన పెట్టేస్తుంటానని ఇదివరకు రాజమౌళి చాలా సందర్భాలలో చెప్పారు.
Advertisement
Read also: వివాహం జరిగే సమయంలో వధువరులు తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?
అయితే తెలుగుజాతి కీర్తిని అంతర్జాతీయంగా చాటి ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మాత్రం రాజమౌళి ఇలా చేయలేదట. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు సెట్ కారేమో అన్నంతగా ఆ సినిమాలో నటించారు. అయితే వాస్తవానికి వీరి కంటే ముందు చాలామందిని ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలలో తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ కాంబినేషన్ సెట్ కాలేదట. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించారు.
Advertisement
ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి మల్టీస్టారర్ చేయాలని ఉద్దేశంతో ఈ కథని రూపొందించామని.. మొదట రజనీకాంత్ – అర్జున్, ఆ తర్వాత సూర్య – కార్తీ, రజనీకాంత్ – కమల్ హాసన్ ఇలా చాలా కాంబినేషన్స్ పరిశీలించినట్లు చెప్పారు. కానీ చివరకు రామ్ చరణ్ – ఎన్టీఆర్ లను ఫిక్స్ చేసి కథను సిద్ధం చేశామని తెలిపారు. పైగా ఆ హీరోలు ఇద్దరు ముందు నుంచి మంచి స్నేహితులు కావడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందంటూ చెప్పుకోచ్చారు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్నో అంతర్జాతీయ అవార్డులతో పాటు ఆస్కార్ ని కూడా గెలుచుకుంది.