Advertisement
ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే సైకిల్ ఎక్కాల్సిందే, పెడల్ తొక్కల్సిందే. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఖరీదైన బైక్ లు రెయ్యిమని దూసుకెళ్తున్నాయి. ఎవరికి కెపాసిటీని బట్టి వాళ్ళు రకరకాల వెహికిల్స్ వాడుతున్నారు. అయితే బైక్ మీద ప్రయాణం చేసే సమయంలో మనం ఎవరినైనా గమనిస్తే రకరకాలుగా కూర్చుంటారు. ముఖ్యంగా మహిళలను గమనిస్తే వారు ఎడమవైపుకి తిరిగి మాత్రమే కూర్చుంటారు. కొంతమంది నడుము నొప్పి, మరి కొంతమంది మరికొన్ని కారణాలతో ఇలా కూర్చుంటూ ఉంటారు. కానీ చాలావరకు ఎడమవైపుకి కూర్చోవడం మనం చూస్తూ ఉంటాం. అలా ఎందుకు కూర్చుంటారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
Advertisement
Read also: ANASUYA BHARADWAJ: “రంగస్థలం” లో రంగమ్మత్త క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే ?
Advertisement
మనదేశంలో రోడ్డు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి.. మొదటగా కార్లు తయారీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉండేది. అలా ఉండడానికి కారణం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ లో ఎదుటి రోడ్డుని, వాహనాలను గమనించడం తేలిక అని, మనదేశంలో ఎడమ చేతి డ్రైవింగ్ అవ్వడం వల్ల దిగేటప్పుడు తమ డెస్టినేషన్ ఏరియా ఎడమవైపే ఉంటుంది. అందుకే ఆ అలవాటు వల్ల లెఫ్ట్ వైపు దిగొచ్చు. ఇక బండి డ్రైవ్ చేసే వారు ఎక్కువగా కుడి పాదం ఫుడ్ బ్రేక్ మీద, ఎడమ పాదం నేలపై ఉంచుతారు.
బ్యాలెన్స్ కోసం వెనుక వారు ఎక్కువగా ఎడమవైపుకి మాత్రమే ఎక్కుతారు. అందుకే లెఫ్ట్ హ్యాండ్ వైపు కూర్చుంటున్నారు. అలాగే ఒకప్పటి స్కూటర్లకు ఇంజన్ మరియు కిక్ రాడ్ కుడివైపున మాత్రమే ఉండేది. అందువల్ల ఫుట్ రెస్ట్ ని ఎడమవైపు అమర్చారు. అందుకే ఎక్కువగా ఆడవాళ్ళు ఎడమవైపు కూర్చునేవారు. ఇక తర్వాత రకరకాల బైక్ లు, రకరకాల డిజైన్లతో వచ్చేశాయి. అయినా ఆ పద్ధతి కొనసాగుతూనే వస్తుంది. కొందరికి ఇది అలవాటుగా కూడా మారిపోయిందని చెప్పాలి.