Advertisement
వివాహమనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరిచిపోలేని ఘట్టం. కానీ ప్రస్తుత కాలంలో వివాహాలు చాలా లేటు వయసులో చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం చాలామంది లైఫ్ లో సెట్ అవ్వాలి. ఆకర్షణీయమైన జీతం వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనతో చాలా ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, మన ఇప్పటివరకు టాలీవుడ్ భామలు విదేశాలకు చెందిన వారిని పెళ్ళాడి సెటిల్ అయ్యారు. అలా పెళ్లాడిన వారు ఎవరు ఇప్పుడు చూద్దాం.
Advertisement
READ ALSO : ANASUYA BHARADWAJ: “రంగస్థలం” లో రంగమ్మత్త క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే ?
రంభ
టాలీవుడ్ లో సీనియర్ హీరోగా రంభ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఆమె అందానికి కుర్ర కారు ఫిదా అయ్యేవారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగలో స్పెషల్ సాంగ్ చేసిన రంభ తన అందంతో అవాక్కయ్యేలా చేసింది. ఇక రంభ విజయవాడలోనే జన్మించారు. సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన రంభ కెనడాకు చెందిన ఇంద్రన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
మీరాజాస్మిన్
Advertisement
భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో మీరాజాస్మిన్ కు ఎంతో పాపులారిటీ వచ్చింది. ఇక ముంబైలో అనిల్ జాన్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకున్న మీరా ఆ తర్వాత న్యూజెర్సీలో సెటిల్ అయ్యింది.
READ ALSO : “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?
గోపిక
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ హీరోయిన్ గోపిక మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈ హీరోయిన్ అజిలేష్ చాకో అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
ప్రీతి జింటా
టాలీవుడ్ లో ప్రేమంటే ఇదేరా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ప్రీతి జింటా. ఇక ప్రస్తుతం జీని గుడ్ ఇనఫ్ అనే విదేశీయుడు నీ పెళ్ళాడి సెటిల్ అయ్యింది.
రాధిక ఆప్టే
రక్త చరిత్ర సినిమాలో పరిటాల సునీత పాత్రలో నటించడంతో పాటు లెజెండ్ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించింది. ఈ హారట్ బ్యూటీ. ఆ తర్వాత లండన్ కు చెందిన బెనాడిక్ట్ టేలర్ ను పెళ్లాడింది.
READ ALSO : ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ లో ఏది బెస్ట్ ?