Advertisement
Pawan Kalyan Wife Renu Desai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన రేణు దేశాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరు బద్రి చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటినుంచే సహజీవనం చేస్తూ అఖిరానందన్ పుట్టాక వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పవన్ కళ్యాణ్ మరియు రేణు మధ్య కొన్ని విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వారు విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కూతురు, కొడుకు,ఎప్పుడూ దగ్గరుండి చూసుకుంటూనే ఉంటారు. పెళ్లి తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరమైంది.
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 04.04.2023
కానీ చాలా రోజుల తర్వాత రవితేజ హీరోగా వస్తున్న “టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తుందట. ఆమె యాక్టింగ్ కు దూరమైన కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.. ఇది కాస్త క్షణాల్లో వైరలైంది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. మన లైఫ్ లోకి కొందరు అనుకోకుండానే వస్తారు.. మళ్లీ కొన్ని రోజులు మనతో ఉండి వెళ్లిపోతారు..
Advertisement
also read: దేవిశ్రీని పెళ్లి చేసుకునే అమ్మాయి వయసులో 17 ఏళ్లు చిన్నదా..?
మండుటెండలాంటి మన జీవితంలోకి చల్లని మేఘాలలో వస్తారు. వారి రాకతో మన జీవితం మారుతుంది అనుకునే టైంలో వారు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఇక వారు మన జీవితంలోకి వచ్చిన క్షణాలు మన జీవితంపై పూర్తి ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా వారు మనతో చేసిన ప్రయాణం గుర్తు చేసుకుంటే బాధ కలగవచ్చు. కొంతమంది మన లైఫ్ ను పరిపూర్ణం చేసి కన్నీళ్లు వస్తే తుడిచి మన జీవితాలు మరింత హ్యాపీనెస్ ని పంచుతూ నవ్విస్తుంటారు. అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది నెటిజన్స్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఇలా రాసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
also read: “బలగం, దసరా”లతో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు..తెలంగాణ వారంటే తాగుబోతులేనా..?