Advertisement
పదేళ్లు ప్రేమించుకుని 2017 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య – సమంత జంట అనూహ్యంగా విడిపోయిన విషయం తెలిసిందే. ఎంతో చక్కగా ఉన్న వీరిద్దరూ అభిమానులకు షాక్ ఇస్తూ తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ఎందుకు విడిపోయారు అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ తర్వాత ఇటు నాగచైతన్య, అటు సమంత.. ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ ప్రొఫెషనల్ లైఫ్ తోనే ఎక్కువగా మమేకమయ్యారు.
Advertisement
Read also: విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!
సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డట్టుగా కొన్నాళ్ళుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య సన్నిహితంగా ఉన్న ఫోటోలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ డేటింగ్ వార్తలపై ఇప్పటివరకు నాగచైతన్య మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల వీరిద్దరూ ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫోటో కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్ లో శోభిత టేబుల్ వద్ద కూర్చోగా, దానికి ముందు చెఫ్ తో కలిసి నాగచైతన్య దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత.. నాగచైతన్య డేటింగ్ రూమర్స్ పై స్పందించినట్లు వార్తలు వచ్చాయి. “ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనేది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది ” అని సమంత పేర్కొన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ కథనంపై సమంత స్పందించింది. నేనెప్పుడూ అలా చెప్పలేదంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దీంతో సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Read also: మొట్టమొదటి బస్ డ్రైవర్ గా 24 ఏళ్ల షర్మిల.. సెల్యూట్ చేస్తున్న ప్రయాణికులు..!!
I never said this!! https://t.co/z3k2sTDqu7
— Samantha (@Samanthaprabhu2) April 4, 2023