Advertisement
ఎప్పుడైనా ఎయిర్ కూలర్, ఎయిర్ కండిషనర్ ల నుండి వచ్చే గాలిలో ఏది నాన్యమైనది అనే అనుమానం తలెత్తిందా, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఎయిర్ కండిషనర్ గదులలో ఒకే గాలిని తీసుకుని చల్లబరిచి బయటకు వదులుతుంది. దీనివల్ల ఆ గాలి చాలా పొడిగా ఉంటుంది. కానీ ఎయిర్ కూలర్ బయట నుండి తాజా గాలిని తీసుకొని గాలిని చల్లబరిచి చల్లని తాజాగాలిని వదులుతుంది.
Advertisement
ఎయిర్ కూలర్ నుండి వచ్చే గాలి తేమతో కూడుకొని ఉంటుంది. ఈ కారణంగా ఎయిర్ కండిషనర్ కంటే ఎయిర్ కూలర్ నాణ్యమైన గాలిని అందిస్తుంది. ఎంతగా అంటే కూలర్ ద్వారా వచ్చే గాలి 100శాతం నాణ్యమైనది. ఎయిర్ కూలర్లో గాలి చల్లబడటానికి నీరు అవసరం అవుతుంది. అందుకే ఎయిర్ కూలర్ గాలి సహజంగా ఉంటుంది.
Advertisement
అస్తమా, డస్ట్, ఎలర్జీ వంటి సమస్యలు ఉన్నవారికి కూలర్ గాలి బెస్ట్. కానీ ఎయిర్ కండిషనర్ లో గాలి క్లోరోఫ్లోరో కార్బన్, హైడ్రో- క్లోరోఫ్లోరో కార్బన్ల ద్వారా చల్లబడుతుంది. ఇవి పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు. ఓజోన్ పొరను దెబ్బ తీసేంత ప్రమాదం ఇవి. ఎయిర్ కండిషనర్ గాలి చల్లగా ఉన్న అందులో రసాయన మూలకాల వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఎక్కువ. శ్వాస సంబంధ సమస్యలున్న వారికి ఇది ప్రమాదాన్ని పెంచుతుంది.
Read also: “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?