Advertisement
కాబోయే భాగస్వామి గురించి అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా కొన్ని అంచనాలు తప్పకుండా ఉంటాయి. మీరు వివాహం చేసుకోబోతున్నట్లయితే తప్పనిసరిగా కాబోయే భాగస్వామిలో కొన్ని విషయాలను గమనించవలసి ఉంటుంది. లేదంటే పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య అనుబంధం, ప్రేమానురాగాలు దెబ్బతిని చివరికి విడిపోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చు.
Advertisement
సంసార జీవితం సాఫీగా సాగిపోవడానికి డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు. ఇద్దరి మధ్య అన్యోన్యత, ఆత్మీయత, చిలిపి గొడవలు, బాధ్యతలు ఇవన్నీ ఉంటేనే భార్యాభర్తల మధ్య బంధం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యలో ఎలాంటి గుణాలు ఉండాలి? కలకాలం బంధం దృఢంగా ఉండాలంటే ఎలాంటి విషయాలను ముందే గమనించాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Read also: త్రివిక్రమ్ సినిమాల్లో మనకు తప్పకుండా కనపడే ఈ వ్యక్తి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఇదే ?
1) భార్య తన భర్తతో నిజాయితీగా ఉండాలి. చిన్న అబద్ధం మీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే భర్తతో నిజాయితీగా ఉండడం భార్య కర్తవ్యం.
Advertisement
2) చాలామంది స్త్రీలు తమ తప్పులు అంగీకరించరు. తమ తప్పును భాగస్వామి పై నిందించే అలవాటు కలిగి ఉంటారు. ఇలా చేయడం వల్ల సంబంధం బలహీన పడుతుంది. అందుకే మీ తప్పును కచ్చితంగా అంగీకరించండి.
3) మహిళలకు వినే అలవాటు ఉండాలి. ఎందుకంటే భర్త మాట వింటే ఎప్పటికీ గొడవలు రావు. ఏ సంబంధం లోనైనా వినడం చాలా ముఖ్యం కాబట్టి ఒకరి మాట ఒకరు వింటే ఎప్పుడు గొడవలు రావు.
4) భర్త కానీ, భార్య కానీ ఒకరికొకరు గౌరవించుకోవడం అవసరం. ఇలా ఒకరికొకరు గౌరవించుకుంటే ఆ బంధం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.
5) ఇతరులతో మర్యాదగా నడుచుకోని, వినయంగా ఉండని అమ్మాయిని వివాహం చేసుకోకపోవడమే బెటర్. ఇతరులకు గౌరవం ఇస్తూ, వినయంగా మాట్లాడే అమ్మాయిని చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ప్రశాంతత కూడా లభిస్తుంది. మీ వివాహ బంధం బాగుండాలంటే ఈ విషయాలను ముందే గమనించాలి.