Advertisement
Ravanasura Movie Review in Telugu: మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ త్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్షన్ మూవీ “రావణాసుర”. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దక్ష నగర్కర్, అను ఇమ్మాన్యుయేల్, మెఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామ, రవితేజ కలిసి నిర్మించారు. సుశాంత్ మొదటిసారి నెగిటివ్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకి బీమ్స్ సిసిరోలియో, రామేశ్వరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ రావణాసుర చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..
Advertisement
Ravi Teja Ravanasura Movie Story in Telugu: కథ మరియు వివరణ:
ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా కనిపించాడు మాస్ మహారాజా రవితేజ. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. అయితే మూవీ ప్రారంభం కాగానే వరుసగా హ** జరుగుతుంటాయి. అయితే ఆ హత్యలు చేసేది ఎవరన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కోర్టులో న్యాయం జరగకపోతే బయట బాధితులకు న్యాయం చేస్తారు రవితేజ. ఇలా కోర్టులో కాకుండా బయట నుండి న్యాయం చేయడానికి రవితేజ ఎలాంటి త్యాగం చేస్తాడు, ఆ సందర్భంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఈ సినిమాలో తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు రవితేజ. అయితే ఆ సమస్యలని పరిష్కరించే సమయంలో తను ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
ఇక ఈ చిత్రంలో రవితేజ ఎంట్రీ సీన్ మరియు ఇంటర్వెల్ సీన్, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. ఈ చిత్రంలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ఒక ఎత్తు అయితే.. రవితేజ కోసం ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించడం మరో ఎత్తు. ఐదుగురు తమ అందాలతో సినిమాలో హైలైట్ గా నిలిచారు. ఇక ఈ చిత్రంలో సుశాంత్ కూడా తన నటనతో అక్కట్టుకున్నాడు. ఇక మొదటి భాగం కంటే ఈ చిత్రంలోని రెండవ భాగంలో ట్విస్టులు అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. ఓ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు సుదీర్ వర్మ. ఇక ఈ సినిమాకి తనదైన నటనతో ప్రాణం పోశాడు రవితేజ. కానీ అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తానికి ఈ చిత్రం పరవాలేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
హీరోయిన్స్
స్టోరీ
రవితేజ యాక్టింగ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
సాగదీత సన్నివేశాలు
మొదటి భాగం
రేటింగ్: 2.75/5
Read also: త్రివిక్రమ్ సినిమాల్లో మనకు తప్పకుండా కనపడే ఈ వ్యక్తి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఇదే ?