Advertisement
Meter Movie Review and Rating in Telugu: వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్న యంగ్ టాలెంటెడ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తాజాగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ “మీటర్’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రమేష్ కాడూరి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో తమిళ కథానాయిక అతుల్యా రవి తెలుగు తెరకు పరిచయమైంది. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఓ పోలీస్ ఆఫీసర్ కి, ఓ పొలిటీషియన్ కి మధ్య యుద్ధం మొదలైతే ఎలా ఉంటుందనే మెయిన్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ మీటర్ తో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం..
Advertisement
Read also: విరాట్ కోహ్లీ పదవ తరగతి మెమో మీరు చూశారా?
Meter Movie Story in Telugu కథ మరియు వివరణ:
ఈ మూవీలో హీరో (కిరణ్ అబ్బవరం) అర్జున్ కళ్యాణ్ అనే పాత్రలో నటించాడు. అర్జున్ కళ్యాణ్ తండ్రి ఓ నిజాయితీగల పోలీస్ ఆఫీసర్. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్న ఆ పోలీస్ ఆఫీసర్ తన కొడుకుని ఎస్ఐ ని చేయాలని అనుకుంటాడు. కానీ అర్జున్ కి పోలీస్ అవ్వడం ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ అనుకోకుండా సెలక్షన్ క్లియర్ చేసి ఎస్ఐ అయిపోతాడు. పోలీస్ కావడం తనకి ఇష్టం లేకపోవడంతో డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన దగ్గర నుండి ఎప్పుడు డిస్మిస్ అవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు హోమ్ మినిస్టర్ కంఠం బైరెడ్డితో క్లాష్ వస్తుంది. అప్పుడే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇక ఆ సమయంలో అధికారంలోకి రావడానికి బైరెడ్డి చేసిన స్కాం ఏంటి? దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఎఫెక్ట్ అయింది? బైరెడ్డిని అర్జున్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
ఆవారాగా తిరిగే హీరో సడన్ గా పోలీస్ కావడం, తన జీవితం మొత్తంలో అబ్బాయిలను అసహ్యించుకునే హీరోయిన్ కేవలం ఒక్క పాటలోనే హీరోని లవ్ చేయడం లాంటిది ఇప్పటికే చాలా సినిమాలలో చూశాం. మరోసారి ఇందులో కూడా చూడొచ్చు. ముఖ్యమంత్రిని కూడా వణికించే విలన్.. హీరో ముందు మాత్రం పిల్లిలా మారిపోతూ ఉంటాడు. ఇక ప్రతి డైలాగులో పంచులు, ప్రాసలు ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇక అర్జున్ కళ్యాణ్ పాత్రలో కిరణ్ అబ్బవరం అదరగొట్టాడని చెప్పాడు. హీరోయిన్ మాత్రం పాటలకే పరిమితం. హీరో తండ్రి పాత్ర ఆకట్టుకుంది. సినిమా నిడివి 2 గంటల 7 నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ సాగదీతగా అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది.
Meter Review : ప్లస్ పాయింట్స్:
కిరణ్ అబ్బవరం
కామెడీ
ఇంట్రవెల్ సీన్
మైనస్ పాయింట్స్:
మ్యూజిక్
స్టోరీ
రేటింగ్: 2/5
Read also: నాగచైతన్య పై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టిన సమంత! ఏమని ఇచ్చిందంటే?