Advertisement
గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ యుర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులైంది. గతేడాది డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో సినిమా ఓపెనింగ్ జరిగింది. దీంతో షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ని, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నించారు.
Advertisement
READ ALSO : నాగచైతన్య పై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టిన సమంత! ఏమని ఇచ్చిందంటే?
Advertisement
ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకి తాజాగా బుధవారం రోజు శుభవార్తను అందించారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో ప్రారంభం అయింది. పది రోజుల పాటు సాగే ఈ చిన్న షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో హాజరయ్యాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ మరియు పోలీస్ ఆఫీసర్ రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా హరీష్ శంకర్ ఓ చిన్న పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది.
ఇందులో పవన్ కళ్యాణ్ కుర్చీ వెనకకి తిప్పి కూర్చుని ఒక చేతిలో టీ గ్లాస్, మరో చేతిలో గన్ పట్టుకొని ఉన్నాడు. వెనకనుంచి తీసిన ఫోటోని పోస్టర్ తో రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ పోస్టర్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదని, డైరెక్టర్ హరీష్ శంకర్ అని, ఫేక్ ఫోటోతో అభిమానులను మోసం చేయాలనుకుంటున్నారా అంటూ హరీష్ శంకర్ ని, మైత్రి నిర్మాణ సంస్థని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు, నేటిజెన్లు. ఈ పోస్టర్ ని బాగా గమనించి చూస్తే అచ్చం హరీష్ శంకర్ ని వెనకనుంచి చూసినట్టే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం పవన్ ని కొత్త లుక్ లోకి మార్చారా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ అప్డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
READ ASLO : ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని టాలీవుడ్ సెలెబ్రెటీల 25 +పెళ్లి ఫోటోలు !