Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ ఓరియెంటెడ్ చిత్రాలు అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది అల్లరి నరేష్ మాత్రమే. ఇప్పటికే ఆయన ఎన్నో కామెడీ చిత్రాలు చేసి సూపర్ కామెడీ హీరోగా పేరుపొందారు. అలాంటి అల్లరి నరేష్ కామెడీ సినిమాలు తెరమరుగవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అనేక టీవీ కామెడీ షోలు పుట్టుకు రావడమే. జనాలంతా ఆ కామెడీ షోలు చూడడం వల్ల ప్రత్యేకంగా కామెడీ సినిమాలకు మొగ్గు చూపడం లేదు. దీనివల్ల అల్లరి నరేష్ సినిమాలు ఎక్కువగా రావడం లేదని చెప్పవచ్చు. దీంతో అల్లరి నరేష్ కామెడీ సినిమాలు వదిలి కంటెంట్ ఉన్న చిత్రాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
also read:మంచు ఫ్యామిలీలో గొడవలకి కారణమైన సారథి ఎవరు? ఆయన ఏం చేశారు?
దీనిలో భాగంగానే నాంది అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమా డైరెక్టర్ తోనే ఉగ్రం అనే మరో చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతం అది సెట్స్ పై ఉంది. ఇక ఇదంతా పక్కన పెడితే అల్లరి నరేష్ ఒక మంచి కామెడీ సినిమా వదిలేసుకున్నాడు. అదేంటంటే వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, సునీల్ హీరోగా చేసిన పూలరంగడు చిత్రం. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమాను ముందుగా అల్లరి నరేష్ చేయాలనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వదిలేసుకోవాల్సి వచ్చిందని ఆయన బాధపడ్డారట.
Advertisement
also read: రాహుల్ గాంధీ పై “కాశ్మీర్ పైల్స్” దర్శకుడు సంచలన ట్వీట్.. అదే నిజమైందంటూ..
అయితే ఈ చిత్రంతో సునీల్ సిక్స్ ప్యాక్స్ కూడా చేశారు. ఈ చిత్రంలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయని చెప్పాలి. అంటే అప్పటికే ఈ డైరెక్టర్ తో నరేష్ ఆహ నా పెళ్ళంట అనే మూవీ కూడా చేశారు. అయితే ఆయన నెక్స్ట్ మూవీ కూడా నరేష్ తోనే చేయాల్సింది కానీ కొంచెంలో మిస్ అయిందని, దీంతో ఆ హిట్ సునీల్ కి వెళ్లిందని బాధపడ్డారట. అయితే ఈ సినిమా తర్వాత సునీల్ చాలా సినిమాలు చేశారు కానీ అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో , హీరో అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు అని చెప్పవచ్చు.
also read:సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టికెట్ ధరలు