Advertisement
రెండు సంవత్సరాల క్రితం కరోనా కారణంగా విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. దీంతో చాలామంది విద్యార్థులు వెనుకబడి పోయారు. గత సంవత్సరం కాలం నుంచి విద్యా సంస్థలు తెరుచుకొని పూర్తిస్థాయిలో స్కూల్స్ కాలేజీలు నడిచాయి. అనుకున్న సిలబస్ పూర్తిచేసుకుని త్వరలో ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టేందుకు స్కూల్స్ సంసిద్ధ మయ్యాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ తేదీలను విడుదల చేసింది.
Advertisement
also read:Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 10.04.2023
ఏప్రిల్ 12 నుంచి పరీక్షలు నిర్ణయించాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒకటి నుంచి 5వ తరగతి వారికి నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉండడంతో ఏప్రిల్ 17వ తేదీన పరీక్షలు పూర్తవుతాయి. ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి మధ్య వారికి మాత్రం ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామ్స్ ముగుస్తాయి. ఈ యొక్క పరీక్షల ఫలితాలను 21వ తేదీన విడుదల చేయనున్నారు.
Advertisement
also read: అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న 5 టాలీవుడ్ స్టార్స్..!!
అనంతరం ఏప్రిల్ 24 న తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి విద్యార్థుల పూర్వ అభివృద్ధిపై చర్చించాలని హెడ్మాస్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీని తర్వాత ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హాలిడేస్ ఉంటాయని విద్యాశాఖ ప్రకటన చేసింది. ఈ సెలవులు జూన్ 11వ తేదీ వరకు కొనసాగుతాయని. అంటే 48 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. అనంతరం జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి పునః ప్రారంభమవుతాయని విద్యాశాఖ ఇప్పటికే ఆయా స్కూల్లకు ప్రణాళిక జారీచేసింది.
also read: అయ్యో అల్లరి నరేష్ అలాంటి సినిమాని ఎలా మిస్ చేసుకున్నావయ్యా..!!