Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో ఎవరికి లేనంత అభిమానులు పవన్ కు ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా రేణు దేశాయ్ హీరోయిన్ గా మన ముందుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని రోజులు కలిసి ఉన్న తర్వాత వీరి మధ్య కాస్త ఇబ్బందులు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. పవన్ కళ్యాణ్ విడిపోయిన తర్వాత రేణు రెండో పెళ్లిపై అనేక వార్తలు వచ్చాయి.
Advertisement
ALSO Read:అప్పుడల-ఇప్పుడిలా 1st మూవీకి ఇప్పటికీ ఈ హీరోయిన్ ఎలా మారాలంటే.. చూస్తే ఆశ్చర్యపోతారు..!!
ఈ తరుణంలో పవన్ ఫ్యాన్స్ అటాక్ చేశారు. వదిన అంటూనే రేణు రెండో పెళ్లిని తప్పుబడుతూ ట్రోల్ చేశారు. అటు మూడో పెళ్లి కూడా చేసుకున్నప్పటికీ ఆయనపై మాత్రం ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు. ఈ సందర్భంలో తాజాగా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ సోషల్ మీడియా యాక్టివిస్టు కృష్ణకుమారి చేసిన కామెంట్స్ వీడియోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది.. ఈ వీడియోలో కృష్ణకుమారి మాట్లాడుతూ.. సమాజం మహిళపై ఫోకస్ పెడుతుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే అందరి దృష్టి మహిలపై ఉంటుంది తప్ప మగాడిపై ఉండదని , ఈ సమాజంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి పరిణామాలు చాలా దారుణం అని చెప్పింది.
Advertisement
ALSO Read:లీకేజ్ కేసు.. కీలక పరిణామాలెన్నో!
ఈ తరుణంలో పవన్ రేణు విషయం గురించి మాట్లాడుతూ నా జీవితంలో రేణు పడిన కష్టాలు పవన్ విషయంలో ఆమె చేసిన త్యాగాలు వివరంగా చెప్పింది. పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ సహజీవనం చేసి ఓ బిడ్డను కనీ మన ముందుకు వచ్చింది. అలాంటి వ్యక్తిని వదులుకునే అవకాశమే రాకూడదు అని రేణు పవన్ కళ్యాణ్ కి అన్ని విధాల సహాయ, సహకారాలు అందించిందని తెలియజేసిన కృష్ణకుమారి. రేణు గనక నా కొడుకు పుట్టింది సహజీనం వల్ల కాదు పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పవన్ ఇప్పటికె జైలు శిక్ష పడేదని తెలియజేసింది. ఈ వీడియోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈవిడ ఎవరో నాకు తెలియదు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు.. కానీ తొలిసారిగా నా గురించి క్లియర్ గా మాట్లాడుతూ నాకు సపోర్ట్ గా నిలిచిందంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయింది.
ALSO Read:ఉక్కు నినాదం.. కేంద్రంపై బీఆర్ఎస్ కొత్త యుద్ధం