Advertisement
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నా ఇక్కడి హీరోలన్నా దర్శకులన్నా ఇతర ఇండస్ట్రీల వారికి చాలా చిన్న చూపు ఉండేది.. కానీ గత కొన్ని ఏళ్ల నుంచి అదంతా మారిపోయింది.. తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు ప్రపంచ దేశాల సినిమా ఇండస్ట్రీలు చూస్తున్నాయి. అంతటి అద్భుతమైన సినిమాలు తీసి టాలీవుడ్ ఇండస్ట్రీ ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా చేస్తున్నారు దర్శకులు. ఈ విధంగా వారి పేరు సంపాదించు కోవడమే కాకుండా హీరో హీరోయిన్లకు కూడా మంచి కెరియర్ ను ప్రసాదిస్తున్నారు..
Advertisement
అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది దర్శకులు అద్భుతమైన చిత్రాలు తీసి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ విషయంలో కూడా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ 10 దర్శకులలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ..
ఎస్.ఎస్ రాజమౌళి:
also read: అప్పుడల-ఇప్పుడిలా 1st మూవీకి ఇప్పటికీ ఈ హీరోయిన్ ఎలా మారాలంటే.. చూస్తే ఆశ్చర్యపోతారు..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారట.
సుకుమార్ :
పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఒక్కో సినిమాకి 40 నుంచి 50 కోట్లు అందుకుంటారట.
త్రివిక్రమ్ శ్రీనివాస్ :
మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ 35 నుంచి 40 కోట్లు తీసుకుంటారట.
కొరటాల శివ :
Advertisement
తీసింది మూడు సినిమాలు అయినా అవి పెద్ద హిట్ అయ్యాయి. అందులో నాలుగోది ఆచార్య పెద్ద ఫ్లాప్. ఈయన 25 కోట్ల నుంచి 30 కోట్లు తీసుకుంటారట.
వంశీ పైడిపల్లి:
ఈ దర్శకుడు కూడా హిట్ సినిమాలు అందించారు . 20 నుంచి 25 కోట్లు అందుకుంటారట.
also read:పబ్లిక్ టాయిలెట్ల డోర్ల కింది భాగంలో ఖాళీగా ఎందుకు ఉంచుతారో తెలుసా..?
అనిల్ రావిపూడి:
పటాస్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ త్రీ ఇలా తీసిన ప్రతి సినిమాతో విజయం అందుకున్నారు అనిల్. ఈయన 20 నుంచి 25 కోట్లు ఛార్జ్ చేస్తారట.
బోయపాటి శ్రీను:
మాస్ సినిమాలంటే గుర్తుకు వచ్చేది బోయపాటి శీను. ఈయన కూడా 20 నుంచి 25 కోట్ల అందుకుంటారట.
పరశురాం బుజ్జి :
గీతా గోవిందం, సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన పరశురాం 10 కోట్ల నుంచి 15 కోట్లు అందుకుంటారట
సందీప్ రెడ్డి వంగ :
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ ని, కబీర్ సింగ్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ రెడ్డి 10 కోట్ల నుంచి 15 కోట్లు పారితోషకం అందుకుంటారట.
also read: భయం తన హిస్టరీలోనే లేదంటున్న రాహుల్