Advertisement
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె ఒకప్పటి హీరోయిన్ గా కంటే కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే బాగా పాపులర్. బద్రి సినిమా సమయంలో ప్రేమించుకుని, లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండి, అనంతరం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లై సినిమాలకు దూరంగా ఉంది రేణు దేశాయ్. ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా 2012లో పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుంది రేణు దేశాయ్. అప్పటినుంచి పిల్లలను చూసుకుంటూ ఒంటరిగానే గడుపుతుంది. ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తోంది.
Advertisement
Read also: SHAKUNTALAM MOVIE REVIEW: “శాకుంతలం” ఫస్ట్ రివ్యూ.. కంటతడి పెట్టాల్సిందే..!
అయితే తాజాగా రేణు దేశాయ్ కుమారుడు అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ కారణంగా.. పలువురు నెటిజెన్లు, రేణు దేశాయ్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతోందన్న విషయం తెలిసిందే. అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో ని పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు నెటిజెన్లు లైక్ లు, కామెంట్లతో వైరల్ చేశారు. అయితే అందులో ఒక నెటిజన్.. ” మేడమ్.. ఒక్కసారైనా మా అకీరా ని సరిగ్గా చూపించండి. మా అన్న తనయుడిని చూడాలని ఆశగా ఉంటుంది” అని కామెంట్ చేశాడు. దీనికి రేణు దేశాయ్.. “మీ అన్న తనయుడా..? అకీరా నా కొడుకు.. మీరు ఇకనైనా మాట్లాడే పద్ధతి నేర్చుకోండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Advertisement
మీరు వీరాభిమానులు కావచ్చు.. కానీ పద్ధతిగా ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అని రియాక్ట్ అయ్యారు. దీంతో ఆమె ఎందుకు ఇంతగా స్పందించారు..? అసలు ఏమైంది..? నెటిజెన్లు ఆమెని అంతగా ఇబ్బంది పెట్టారా..? అంటూ చర్చ మొదలైంది. ఆమె చేసిన పోస్ట్ కి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ” మేడమ్ మామూలుగా తెలుగు రాష్ట్రాలలో మాట్లాడేటప్పుడు.. నువ్వు ఎవరి బిడ్డవి అని అడిగితే తండ్రి పేరే చెబుతారు. అది మా సంస్కృతి. అందుకే ఇలా అంటున్నాం. కాబట్టి అభిమానులపై ఊరికే ఆగ్రహం వ్యక్తం చేయడం మంచిది కాదు” అని కామెంట్ చేశాడు.
Read also: విడాకుల సమయం కంటే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నా – సమంత
ఇలాగే మరికొంతమంది కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ” మా అన్న కొడుకుని చూపించండి అంటే నెగిటివ్ కామెంటా..? మన ఫ్యాన్స్ అందరూ ఈమెను ఇకపై అన్ ఫాలో చేయండి. ఎన్నికలు వస్తున్నాయి కదా ఈమె కొత్త స్టంట్స్ చేస్తోంది” అంటూ మరో నేటిజన్ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ పై రేణు దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ” మీరు మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లయితే ఇలాంటి కామెంట్స్ చేయగలుగుతారా..? మీరు మాట్లాడిన విధానం కరెక్టేనా? అనేది మీ అమ్మను అడిగి తెలుసుకోండి” అని రిప్లై ఇచ్చారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా..? ఇంకెంత దూరం వెళుతుందో..? వేచి చూడాలి.
Read also: పుష్ప 2 టీజర్లో సుకుమార్ చూపెట్టిన ఈ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?