Advertisement
మన భారతదేశం అంటేనే అనేక సంప్రదాయాలు కలిగిన దేశం. ఇక్కడ ఎక్కువగా హిందువులు ఉండటం వల్ల దేవాలయాలకు వెళ్లి దేవుళ్లను పూజిస్తారు. ఇక్కడ దేవుళ్ళతోపాటు చెట్టు, పుట్ట,రాయి, రప్ప అన్నింటినీ పూజిస్తారు. అంతేకాకుండా చనిపోయిన మన పూర్వీకులను దేవుళ్ళుగా భావించి వారి ఫోటోలను పూజ గదిలోనో దేవుల్ల పక్కన పెడుతూ ఉంటారు.
Advertisement
Also Read: సల్మాన్ ఖాన్ ఇంతమంది హీరోయిన్స్ తో రిలేషన్షిప్ నడిపారా..? పెద్ద నెంబరే..!!
ఇలా పూజించడంలో తప్పేమీ లేదు కానీ చనిపోయిన వ్యక్తిగా ఫోటోలను పూజ గదిలో ఉంచకూడదట. ఇలా చేయడం వల్ల దేవుళ్లకు కోపం వస్తుందట.. మరి దానికి కారణాలు ఏంటో చూద్దాం.. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచడం సరికాదు. దీంతో సదరు కుటుంబానికి మంచి జరగదట. ఇండ్లలో ఈశాన్య దిశగా పూజ గదిని , నైరుతి దిశగా చనిపోయిన వారి ఫోటోలను ఉంచాలని వాస్తు సిద్ధాంతం చెబుతోంది.
Advertisement
Also Read:విడాకుల సమయం కంటే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నా – సమంత
ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. అంతేకాకుండా ఇంట్లోని కుటుంబ సభ్యులకి కూడా మానసిక ప్రశాంతత ఉండదట. చనిపోయిన వారి యొక్క ఫోటోలను దేవుళ్ళ పక్కనే ఉంచి పూజ చేయడం హిందూ ధర్మం ప్రకారం పెద్ద తప్పిదమే అవుతుంది. మనిషి ఎల్లప్పుడూ దేవుడితో సమానం కాదని, నియమాలను అతిక్రమించి అలా చేస్తే ఆ కుటుంబంలో కష్టాలు ఎదురవుతాయని నమ్ముతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇలా చేయరాదు.
Also Read: పుష్ప 2 టీజర్లో సుకుమార్ చూపెట్టిన ఈ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?