Advertisement
Rudrudu Movie Review in Telugu:: నటుడు, డాన్స్ మాస్టర్, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా.. కేతిరేసణ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ త్రిల్లర్ చిత్రం రుద్రుడు. ఈ చిత్రంలో లారెన్స్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. అలాగే శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
Advertisement
ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఠాకూర్ మధు రిలీజ్ చేశారు. ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Rudrudu Movie Story in Telugu:కథా మరియు వివరణ:
ఒక మామూలు ఉద్యోగం చేసుకునే రుద్రుడు (లారెన్స్) తనకి నచ్చిన అమ్మాయి అనన్య ( ప్రియా భవానీ శంకర్) ని వివాహం చేసుకొని కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అయితే అంతా బాగానే ఉంది అని అనుకునే సమయంలో రుద్రుడి జీవితంలోకి విలన్ ( శరత్ కుమార్) ఎంట్రీ ఇస్తాడు. తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న అనన్యని చం*. దీంతో రుద్రుడి జీవితం తలకిందులవుతుంది. అయితే తన భార్యని చంపింది ఎవరు..? వాళ్లు అనన్య ని ఎందుకు చంపారు..? వారిని రుద్రుడు ఎలా కనిపెట్టాడు..? దీని వెనక ఎవరున్నారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
ఇక ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, డ్రామా, రొమాన్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. ఇక మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రాఘవ లారెన్స్. అతని డాన్స్ ఎప్పటిలాగానే సూపర్ గా ఉంది. ఇక ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్. అయితే సినిమా కథ పాతదే అయినప్పటికీ హీరో ఎలివేషన్స్, లవ్ ట్రాక్, పతాక సన్నివేశాలు కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉన్నాయి. ఇక ప్రియా భవాని శంకర్ పరవాలేదనిపించింది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నప్పటికీ.. పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ఆర్.డి చాయ గ్రహణం పరవాలేదు. మొత్తం మీద రుద్రుడు ఒక అవుట్ డేటెడ్ కమర్షియల్ చిత్రం.
ప్లస్ పాయింట్స్:
లారెన్స్ యాక్టింగ్
పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథనం
సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 2.5/ 5