Advertisement
Vidudala Part 1 Movie Review Telugu: వెట్రిమారన్.. తమిళనాట ఈ పేరు ఓ సంచలనం. జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్.. స్టార్ల కంటే కూడా కథలకే పెద్ద పీట వేస్తూ సినిమాలు తీయడం ఆయన శైలి. తాజాగా ఈయన రూపొందించిన తమిళ సినిమా “విడుతలై” రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. రెండు భాషల్లో తమిళ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హాస్యనటుడు సూరి కథానాయకుడిగా నటించారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించారు. మార్చి 31న విడుదలై తమిళనాడులో బాక్సాఫీస్ కలెక్షన్లను బద్దలు కొడుతున్న ఈ చిత్రం నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కి చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “విడుదల” తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
Advertisement
Vidudhala Movie Story: కథ మరియు వివరణ:
కుమరేశన్ (సూరి) కొత్తగా ఉద్యోగంలో చేరిన పోలీస్ కానిస్టేబుల్. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అయితే అక్కడ పోలీసులకి, ప్రజాదళం సభ్యులకు ఎన్కౌంటర్లు, ఒకరి మీద మరొకరు పై చేయిగా ఉండడానికి ఏమి చేయాలనే ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పేరిట అక్కడ ఫ్యాక్టరీలు కట్టిస్తామని చెబుతూ.. పోలీస్ క్యాంపులని నడుపుతూ, ప్రైవేట్ కంపెనీ వారితో కలిసి క్యాంపు ని నిర్వహిస్తుంది.
Advertisement
అక్కడ ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్ ( విజయ్ సేతుపతి) ని పట్టుకునేందుకు పనిచేస్తున్న ప్రత్యేకమైన పోలీస్ దళానికి రోజు జీప్ లో ఆహరం సరఫరా చేయడమే కుమరేశన్ పని. ప్రజలకి కష్టం వస్తే ఆదుకోవడమే పోలీస్ విధి అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. అయితే కుమరేశన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? పెరుమాళ్ ని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలను చేపట్టాడు..? అటవీ ప్రాంతంలోని మహిళలపై పోలీసుల అరాచకాలు ఎలా సాగాయి..? పోలీసుల అరాచకాలను అడ్డుకోవడానికి సూరి ఎలా ప్రయత్నించాడు..? కూంబింగ్ లో పోలీసులకు చిక్కిన పెరుమాళ్ పరిస్థితి ఏమైంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇక చాలా కాలం నుండి కమీడియన్ గా ప్రేక్షకులను అలరిస్తున్న సూరి ఈ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. ఈ చిత్రంలోని ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుతున్నాయి. ఇక విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో సహజ సిద్ధమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వెట్రిమారన్.
అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక మూల విరాట్ లా నిలిచారు. ఈ చిత్రానికి ఇళయరాజా నేపథ్య సంగీతం ఓ హైలెట్ గా నిలిచింది. 1987 నేపథ్యంలో సాగే కథ ఇది. రైలు ప్రమాదంతో సినిమా ఆరంభమైనా.. దట్టమైన అడవులను చూపించడం నుంచే దర్శకుడు విడుదల ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లాడు. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమా సాగదీతలా అనిపిస్తుంది. ఇక ఈ మూవీలోని ప్రేమ కథలో కొత్తదనం లేదు. మొత్తానికి అయితే చివరిలో పార్ట్ 2 పై ఆసక్తిని పెంచారు.
Vidudhala Movie Review ప్లస్ పాయింట్స్:
పతాక సన్నివేశాలు
నటీనటులు
కథా ప్రపంచం
మైనస్ పాయింట్స్ :
సాగదీత సన్నివేశాలు
సంఘర్షణ లేని కథ
రేటింగ్: 2.5/5
Read also: మన అభిమాన నటులు ఒకప్పుడు ఎలా ఉండేవారో తెలుసా..!