Advertisement
మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం చేసే ప్రతి పూజ వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి కారణం దాగి ఉంటుంది. మనం ఎప్పుడైనా గంగ స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో నాణాలు విసురుతూ ఉంటాం. దీనివల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఈ ఆచారం ఇప్పటిది కాదు , పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. నదుల ఒడ్డున ప్రజల నివాసము ఉండటం ప్రారంభించిన నాటి నుంచి ఈ ఆచారం అందుబాటులో ఉంది.
Advertisement
also read: భర్త ఇంట్లో లేని సమయంలో భార్యలు చేయ కూడని తప్పులు ఇవే..!!
అప్పట్లో రాజీనానాలు చలామణిలో ఉండేవి. వాణిజ్యం లావాదేవీలు రాజీనాణాలతోనే జరిగేవి. దేశంలోని కరెన్సీ రాగి నాణేల రూపంలోనే ఉండేది. కానీ అప్పటి రోజుల్లో భారతదేశం లో రాగి విస్తృతంగా ఉపయోగించేవారు. ప్రజలు వంట చేయడానికి,ఆహారం తినడానికి రాగి పాత్రలు మాత్రమే ఉపయోగించారు. ఎందుకంటే రాగి స్వచ్ఛమైనదని, పవిత్రమైనదని నమ్ముతారు. రాగి లోని ఔషధ గుణాల కారణంగా ఆ పాత్రలో తినడం, తాగడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Advertisement
also read:పాస్ వర్డ్ మిస్టరీ.. అసలు ఏం జరిగింది..?
ఇదంతా పక్కన పెడితే నదిలో కూడా నాణాలు విసరడం చూస్తుంటాం. రాగిని నీటిలో వేస్తే అది నీటిలోని మురికిని తొలగిస్తుందని నమ్మేవారు. రాగి ధాతువు నీటిని శుద్ధి చేస్తుందని భావించేవారు. నదుల లోని నీటిని పరిశుభ్రంగా ఉంచేందుకు అప్పటి రోజుల్లో రాగి నాణేలను నదుల్లో విసిరేసేవారని చెబుతుంటారు. అప్పటినుంచి ఈ ఆచారం అలాగే కొనసాగుతూ వస్తుంది. కానీ కొంతమంది నదిలో డబ్బులు విసిరి వేయడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదని అంటున్నారు.
also read: పెళ్లయిన కొద్ది రోజులకే భర్తలను కోల్పోయిన టాలీవుడ్ స్టార్లు వీళ్లే !