Advertisement
Virupaksha Review Telugu: సాయిధరమ్ తేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలసిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ “విరూపాక్ష” రివ్యూ & రేటింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Advertisement
read also: Virupaksha Movie Heroine Name, age, Family Photos
Virupaksha Movie Story కథ మరియు వివరణ:
80, 90వ దశకంలో జరిగిన కథ ఇది. 1979 నేపథ్యంలో ఓపెన్ అయిన మూవీ మళ్లీ 1990 కి మారుతుంది. రుద్రవరం అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు ఎంతో భయానకంగా ఉంటాయి. ఈ చిత్రంలో సూర్య గా సాయి ధరమ్ తేజ్, నందినిగా సంయుక్త మీనన్ కనిపిస్తారు. అయితే ఈ రుద్రవరం అనే గ్రామంలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఈ ఊరిలో అసలు ప్రజలు ఎందుకు చనిపోతున్నారు, ఎవరైనా చేతబడి చేస్తున్నారా..? లేక మరేవైనా ఇతర కారణాల వల్ల చనిపోతున్నారా అన్న మిస్టరీని సాయిధరమ్ తేజ్ ఛేదిస్తాడు. దీని వెనుక ఎవరు ఉన్నారు..? ఆ ఊరిని పట్టి పీడిస్తున్న శక్తి ఏంటి..? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు..? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
2 గంటల 25 నిమిషాల రన్ టైం తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ జానర్ మూవీ అద్భుతంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ కి ఈ మూవీ మంచి కం బ్యాక్ అని చెప్పవచ్చు. అద్భుతమైన టేకింగ్ తో డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దారు. ప్రారంభం నుండి చివరి వరకు సినిమా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రూపంలేని కన్నును విరూపాక్ష ( శివుడి మూడో కన్ను) అంటారని.. ఈ సినిమాలో రూపంలేని శక్తితో పోరాటం చేస్తారు కాబట్టి ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ని పెట్టారు. ఇక తేజ్, సంయుక్త మీనన్ కెమిస్ట్రీ కూడా బాగా పండింది. సంయుక్త పాత్ర కూడా ఈ సినిమాకి ఓ పిల్లర్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రీ క్లైమాక్స్ లో ఇరగదీసింది. కొన్ని సన్నివేశాలు అయితే దర్శకుడు ముందుగా చెప్పినట్లుగానే వణుకు తెప్పించే విధంగా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్
Virupaksha Movie Review
రేటింగ్: 3/ 5