Advertisement
ఒకప్పటి సమంత, నాగచైతన్య జంట గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా మంచి గుర్తింపు పొందిన జంటల్లో సమంత, నాగచైతన్య ముందు వరుసలో ఉండేవారు. ఈ జంటను చూసి అక్కినేని అభిమానులు ఎంతో మురిసిపోయారు. కానీ వారి సంతోషం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
Advertisement
read also : సమరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా..?
ఏం మాయ చేసావే అనే సినిమాతో పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారి అనంతరం పెళ్లి వరకు దారితీసింది. పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు సంతోషంగా గడిపిన వీరు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అనూహ్యంగా విడాకుల బాట పట్టి విడాకులు తీసేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీగా గడుపుతూ వస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ స్టార్ హీరోలు సమంతతో అవకాశం వస్తే వెంటనే మరో మాట మాట్లాడకుండా నో అని చెబుతున్నారట. దానికి కారణం కూడా ఒకటి ఉందని తెలుస్తుంది.
Advertisement
అదేంటంటే నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే అంటూ తెలుస్తుంది. ఒకప్పుడు ఆమె అక్కినేని ఇంటికి కోడలని, అందుకే ఆమెతో ఎలా నటించాలి అని కొందరు స్టార్ హీరోలు అనుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ స్టార్ హీరో సమంతతో సినిమా చేయమని ఓ డైరెక్టర్ అడగడంతో, వద్దు బాబాయ్ అంటూ దండం పెట్టేసారట. దీన్ని బట్టి చూస్తే సమంత పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. ఇక రాను రాను సమంత చిన్న హీరోలతో పరిమితం అవుతుందేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.