Advertisement
పెళ్లి అంటే నూరేళ్ళ పంట. ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లేదంటే పెళ్లయిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. త్వరలో మీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే కచ్చితంగా వధువు ఈ విషయాలను తెలుసుకోండి. లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకుపోవాల్సి వస్తుంది. అయితే తరాల వరకు చూడకపోయినా వివాహం చేసుకునే వారి గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే జీవితంలో ఇలాంటి వారిని పెళ్లి చేసుకున్నామా అని బాధపడక తప్పదు.
Advertisement
పెళ్లికి ముందు అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయిన తమకు కాబోయే వారి ఇష్ట ఇష్టాలను, వారి లక్ష్యాలు ఒకేలా ఉన్నాయా లేదంటే వేరువేరుగా ఉన్నాయా అనేది కూడా ముందుగానే తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా ఇద్దరి మధ్య గొడవలు జరిగితే ఎలా పరిష్కరిస్తారు. చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు సర్దుకుపోయే స్వభావం ఉందా, లేదా, అన్నది కూడా ముందుగానే పరిశీలించుకోవాలట ఆ వధువు. ఆర్థిక నిర్వహణపై అవగాహన ఉందా లేదా అనే విషయాన్ని కూడా ముందుగానే తెలుసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అలా ఉన్నవాళ్లు జీవితంలో పైకి వస్తారని చెబుతున్నారు. కుటుంబంతో ఏ విధంగా మెలుగుతారు. సంతానంపై వారి అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని కూడా ముందుగానే తెలుసుకోవాలని చెబుతున్నారు. లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పెళ్లికి ముందు వధువు అనేక విషయాలు ఆలోచన చేస్తుంది. పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుంది.. తన భర్త ఎలా ఉంటాడు… ?అని ఆలోచన చేస్తుంది. పెళ్లి తర్వాత ఎలాంటి, సమస్యలు వస్తాయి.. అలాగే చాలా భయం తో ఉంటుంది. కాబట్టి పెళ్లికి ముందు వధువుకు ఎలాంటి భయం లేకుండా చూసుకోవాలి.