Advertisement
మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని వామపక్షాలకు లక్ కలిసొచ్చింది. బీజేపీకి బాగా దగ్గరయ్యాయి సీపీఐ, సీపీఎం పార్టీలు. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి. సీట్ల విషయంలో కేసీఆర్ తో చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
Advertisement
బీజేపీ వ్యతిరేక ఐక్యతను సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నారన్నారు నారాయణ. కేంద్రంతో ఆయన పోరాటం మంచిదే కానీ.. ముందుగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. కేసీఆర్ తీరు ఊరుకో కోడి, ఇంటికో ఈకలా ఉందని విమర్శించారు. హామీలు అమలు చేయకుంటే బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుందని సూచించారు. బీజేపీతో పోరాటం కేసీఆర్ ఒక్కరి వల్ల సాధ్యం కాదన్న ఆయన.. అందర్నీ కలుపుకుని కింది స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించాలని సూచించారు.
Advertisement
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను గద్దె దించేందుకు కేసీఆర్ అనేక వ్యూహాల్లో ఉన్నారు. ఇప్పటికే జాతీయ పార్టీగా హోదా పొందిన ఆప్ ని లైన్ లో పెట్టారు. కేజ్రీవాల్ ను రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ మోడల్ ను వివరించారు. అలాగే, వామపక్ష పార్టీలు, ఎస్పీ సహా కొన్ని దగ్గరగానే ఉన్నాయి. అయితే.. కేసీఆర్ తో కొన్ని పార్టీలు మాత్రం కలిసి రావడం లేదు. దీన్ని గుర్తు చేస్తూ సీపీఐ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న వైరం కారణంగా కలిసే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ చేతిలో పలు పార్టీ ఉన్నాయి. అలాగే, టీఎంసీ మమత తన దారి తనది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక కొన్ని పార్టీలైతే కేసీఆర్ తో ఉన్నట్టే ఉండి హ్యాండ్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యతిరేక ఐక్యత సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని నారాయణ కామెంట్స్ చేసి ఉంటారని అంటున్నారు విశ్లేషకులు. ఇంకోవైపు 2024 ఎన్నికల్లో సత్తా చాటుతామని కేసీఆర్ ప్రకటించారు. దేశమంతా దళిత బంధు నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో అనేది చూడాలంటున్నారు విశ్లేషకులు. నారాయణ అన్నట్టు అందర్నీ ఒక తాటిపైకి తెస్తే గనుకు అనుకున్న లక్ష్యాలు నెరవేరే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు.