Advertisement
ఆస్తికోసం పేగుబంధాన్నే తెంచేశాడు ఓ అన్న. సొంత తమ్ముడనే కనికరం లేకుండా దారుణంగా మట్టుబెట్టాడు. ఆస్తి వ్యవహారం అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపింది. తన వాటాగా వచ్చిన స్థలాన్ని అమ్ముకోవడానికి తమ్ముడు ప్రయత్నించడం ఇష్టం లేని అన్నే తమ్ముడిని ఇంట్లో బంధించి అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 వ డివిజన్ ఉర్సు తాళ్లమండవ ప్రాంతానికి చెందిన గోవిందులు శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురు అన్నదమ్ములు. తల్లిదండ్రులకు చెందిన ఇంటి స్థలాన్ని ముగ్గురు 94.6 గజాల చొప్పున పంచుకున్నారు. అయితే పెద్ద కుమారుడు శ్రీనివాస్ మరణించాడు. కాగా చిన్నవాడైనా శ్రీకాంత్ కి వచ్చిన వాటా విషయంలో అన్న శ్రీధర్ గొడవ పడుతూ ఉండేవాడు. ఇంట్లో వాటా ఇవ్వనని.. ఇక్కడే ఉంటే చంపేస్తా అని అన్న శ్రీధర్ తమ్ముడు శ్రీకాంత్ ని బెదిరించేవాడు.
Advertisement
Read also: కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా హీరో రామ్ తన జోబులో రూపాయి కూడా పెట్టుకోరట ఎందుకంటే ?
శ్రీకాంత్ – శ్రీధర్ ల విషయంలో గత కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. అయితే శ్రీధర్ బెదిరించడంతో శ్రీకాంత్ తల్లితో కలిసి వరంగల్ నుండి ఇల్లు వదిలి నిజామాబాద్ కి వెళ్లిపోయాడు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కరోనా సమయంలో శ్రీకాంత్ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో తన వాటా అయిన ఇంటి స్థలాన్ని విక్రయించి ఆ డబ్బుతో ట్రీట్మెంట్ తీసుకోవాలని భావించాడు శ్రీకాంత్. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ నుండి తన సొంత ఇంటికి వచ్చాడు. ఇంటి స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నించగా సోదరుడు శ్రీధర్ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ ఈనెల ఏడవ తేదీన మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో తన అన్న శ్రీధర్ పై కంప్లైంట్ చేశాడు. దీంతో శ్రీధర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించిన పోలీసులు.. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో తన సోదరుడు భూమి అమ్ముకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని శ్రీకాంత్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అన్న మాటలు నమ్మిన శ్రీకాంత్ భార్యతో కలిసి వరంగల్ కి వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలు చేశాడు.
Advertisement
ఈ క్రమంలో శనివారం ఇద్దరూ కొనుగోలుదారులను వెంట తీసుకొని స్థలం వద్దకు వెళ్లగా.. శ్రీధర్ తమ్ముడు శ్రీకాంత్ పై అకస్మాత్తుగా దాడి చేశాడు. శ్రీకాంత్ నీ ఇంట్లోకి లాకెళ్ళి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బయటికి రాకుండా తలుపు వద్ద బండరాయి అడ్డుగా పెట్టాడు. స్థలం కొనడానికి వచ్చిన వారు ఈ గొడవ చూసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక ఎలాగోలా శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటపడ్డాడు. ఇంట్లో నుంచి బయటపడ్డ అతనిని వదిలిపెట్టని శ్రీధర్.. వీధిలో అందరూ చూస్తుండగానే రాయితో కొట్టి హ** చేశాడు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు శ్రీకాంత్ ను అన్న శ్రీధర్ కొడుతున్నా.. స్థానికులు ఎవరు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఈ ఘటన తర్వాత శ్రీధర్ అతని భార్య పిల్లలు పారిపోయారు. సంఘటనా స్థలానికి ఏసీపీ బోనాల కిషన్, మీల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ చేరుకొని పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ పేర్కొన్నారు.
Read also: ఆ ఒక్క కారణం తోనే తమ సినిమాల్లో నటించడానికి సమంతని మన తెలుగు హీరోలు వద్దు అని అనుకుంటున్నారా?