Advertisement
మనం నివసించే ఇల్లు ప్రశాంతమైన వాతావరణంతో కూడుకొని ఉండాలి. వాస్తు శాస్త్రంలో ఇంటి దిశ కారణంగా సమస్య ఉంటే, వాస్తు దోషాన్ని కొన్ని వస్తువులను ఉపయోగించడం ద్వారా సరిదిద్దవచ్చు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో చికాకుగా ఉంటే అక్కడ లోపం ఉన్నట్లు లెక్క. మానవుని శరీరంలో అయస్కాంత శక్తి ఉంటుంది. అందుకే మనకు సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరం, మనసుపై పడుతుంది. ఏదో తెలియని ఇబ్బంది కలుగుతుంది. అలాగే మనం నివసించే ఇంట్లో కూడా వాస్తు సక్రమంగా ఉందా..? వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం అందరికీ కష్టం. ఇలా ఇంట్లో వాస్తు దోషం ఉందని చెప్పే చిన్న చిన్న సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ఏ ఇంట్లోనైనా వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో ప్రధానంగా కుటుంబ సభ్యులు చీటికిమాటికి అనారోగ్య సమస్యల బారిన పడడం, ఆర్థికంగా విపరీతమైన సమస్యలు రావడం, చిన్న చిన్న విషయాలకి మానసికంగా ఆందోళన కలగడం కూడా వాస్తు దోషం కారణంగానే అని చెబుతున్నారు. అయితే ఇంట్లో వాస్తు దోషం ఉందని చెప్పే ఈ చిన్న చిన్న సంకేతాలు ఏంటంటే.. ఈ సృష్టిలో కొంతమంది దైవాన్ని నమ్మరు. వారు ఈ విశ్వంలో ఉండే ఎనర్జీని నమ్ముతామని మాత్రమే చెబుతారు. దేనిని నమ్మినప్పటికీ చాలా బలంగా నమ్మాలని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.
విగ్రహాన్ని పూజించినా నటనగా చేయవద్దు.. విశ్వాన్ని నమ్మినా నటనగా చేయవద్దని సూచిస్తున్నారు. అందువల్ల వాస్తు శాస్త్రం కానీ, జ్యోతిష్య శాస్త్రం కానీ సెకండ్ ప్రియారిటి లోకి వెళ్లి.. ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయట. అలా ఏదైనా ఒక దానిని నమ్మి దృఢంగా ఉన్న వారికి ఎటువంటి దోషం దరిచేరదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇక వాస్తుతో పాటు ప్రవర్తన కూడా బాగుంటేనే సుఖసంతోషాలతో ఉంటారు. అన్ని రకాలుగా సుఖాన్నిచ్చేది మనం ఉండే ఇల్లు అన్నారు పెద్దలు. అందుకే మనిషికి గృహమే కదా స్వర్గసీమ.