Advertisement
మనం అప్పుడప్పుడు కుదిరితే కుటుంబ సమేతంగా.. వీలైతే స్నేహితులతో సరదాగా హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి వెళుతూ ఉంటాం. ఆ హోటల్స్, లేదా రెస్టారెంట్స్ లో మీరు ఎప్పుడైనా గమనించారా..? ఆ హోటల్స్ లో వంట చేసేవాళ్లు.. తెల్లని టోపీలను ధరిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు అలా తెల్లటి టోపీలను ఎందుకు ధరిస్తారు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? వాళ్లు ఆ తెల్లటి పొడవైన టోపీలను ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పేరు మోసిన హోటల్స్ లో వంట చేసే చెఫ్ లు విధిగా తెల్లని టోపీలను వారి యూనిఫామ్ లో భాగంగా ధరిస్తూ ఉంటారు.
Advertisement
Advertisement
అయితే టోపీ ఎత్తు వంట గదిలోని చెఫ్ యొక్క పొజిషన్ ని సూచిస్తుంది. ఎక్కువ పొజిషన్ కలిగి ఉన్నచో పొడవైన టోపీలను ధరిస్తూ ఉంటారు. ఇక టోపీల లో తెలుపు రంగుని మాత్రమే ఎంచుకోవడానికి కూడా ఓ కారణం ఉంది. అన్ని రంగులలో తెలుపు రంగు అత్యంత పరిశుభ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ విధంగా రెస్టారెంట్లు తమ అతిధులకు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ విధంగా తెల్లటి టోపీలను ధరిస్తారు. ఈ సాంప్రదాయం 1800 ల ప్రారంభంలో ఫ్రాన్స్ లో పురాణ చెఫ్ మేరీ – అంటోని తన చెఫ్ లకు యూనిఫామ్ గా ఉండాలని నిర్ణయించారు. అప్పుడే ఇది ప్రారంభమైందట.
ఇక ఎంతో అనుభవం కలిగిన చెఫ్ లు వారి అనుభవానికి అనుగుణంగా వారు ధరించే టోపీ పొడవు ఉంటుంది. అలాగే జుట్టును వారి ముఖాల నుండి దూరంగా ఉంచడానికి కూడా ఈ టోపీ ఉపయోగపడుతుంది. వంట చేసేటప్పుడు పొరపాటున వెంట్రుకలు ఆహారంలో పడితే.. తినే సమయంలో ఇబ్బంది ఎదురవుతుంది. అందువల్ల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న కారణంతోనే వంట చేసేవారు తమ హెయిర్ ని టోపీ తో కప్పుకుంటారు. ఇక చెఫ్ లు తెల్లటి దుస్తులలో మనకు కనిపించడం వల్ల ఆటోమేటిక్ గా వారిని చూస్తే మైండ్ కూల్ అవుతుంది.