Advertisement
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ షాక్ తప్పలేదు. కేసులో స్టే విధించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సూరత్ కోర్టు తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకెక్కాలన్న యోచనలో రాహుల్ ఉన్నారు. ఆ కోర్టులో తనకు స్టే లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని అంటున్నారు.
Advertisement
సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో రాహుల్ గాంధీ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయినట్టే. అప్పీలుపై ఈనెల 20న ఉత్తర్వులు జారీ చేస్తామని అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్పీ మోగెరా గత వారం ప్రకటించారు. నాడు తీర్పును రిజర్వ్ లో ఉంచారు. గురువారం వాదనల సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ వంటి వ్యక్తి నుంచి ఉన్నత ప్రమాణాలు గల నైతికతను ఎవరైనా ఆశిస్తారని అన్నారు. అనుమతించదగిన చట్టం మేరకే ఈ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు.
Advertisement
రాహుల్ గాంధీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెషన్స్ కోర్టులో పిటిషన్ తిరస్కరించినా.. హైకోర్టులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెబుతున్నారు. మోడీ ఇంటి పేరుగా రాహుల్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేత పరువు నష్టం దావా వేయడంతో రెండేళ్ల జైలు శిక్ష పడింది.
మరోవైపు బీజేపీ ఈ తీర్పు రాహుల్ కుటుంబానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించింది. బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రా మాట్లాడుతూ.. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఈ తీర్పు నిరూపించిందని చెప్పారు. దేశంలో రూల్ ఆఫ్ కాన్స్టి ట్యూషన్ అన్నది ఉందని, అంతే తప్ప ఒక కుటుంబానికి కాదని రుజువు చేసిందన్నారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఓ ఉద్యమాన్నే నడపాలనుకున్నారని, ఇండియాను అప్రదిష్ట పాల్జేసేలా స్టేట్మెంట్లను సేకరించారని పాత్రా ఆరోపించారు.